కమెడియన్ ఓవరాక్షన్… నరకం చూపిస్తున్నాడట

ఏ సినిమా కూడా ఒక్కడివల్ల ఆడదు. ఓ సీన్ కూడా ఒక్కడి వల్ల పండదు. ఆ విషయం ఓ సీనియర్ కమెడియన్ మరిచిపోయినట్టున్నారు. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే పట్టింపే లేదు. సినిమా యూనిట్ ను ఇబ్బంది పెట్టడమే ఆయన టార్గెట్. సినిమా డైరెక్టర్ కు చుక్కలు చూపించటమే ధ్యేయం. అతనికి కావాల్సిన రెమ్యూనరేషన్ టైంకు ఇచ్చినా సరే… అతను పెట్టాలనుకున్న టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఆ పైత్యం ఈ మధ్య మరీ ముదురిందట. ఓ సన్నివేశంలో నలుగురు ఆర్టిస్టులు ఉంటే… అన్ని డైలాగులు తానే చెబుతానంటాడు. పక్కోడికి ఛాన్సే ఇవ్వట్లేదట. పక్కోడు ఎదగడం ఇష్టంలేకో…లేక తాను మాత్రమే ఇండస్ట్రీని ఏలాలనే దురుద్దేశం ఏమైనా పెట్టుకున్నాడో తెలీదు గానీ… ఆయన అరాచకంతో చాలామంది ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు ఇబ్బంది పడుతున్నారట. పైకి చెప్పుకోలేక.. ఆయనకూ చెప్పలేక నరకం అనుభవిస్తున్నారట. ఇక కొత్త దర్శకుల పరిస్థితి వర్ణనాతీతం.  

ఇది ఒక యాంగిల్ మాత్రమే… హీరోయిన్లను గెలకడం ఆయనకు ముందునుంచి ఉన్న అలవాటేనట. అది ఈ మధ్య మరీ ఎక్కువైందట. ఆర్టిస్టులనే కాదు…మహిళా టెక్నీషియన్లను సైతం… తన వింత సైగలతో ఇబ్బంది పెడుతున్నాడట. అయితే పాపం వారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. సెట్లో ఆయన ఉన్నారంటే తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. స్క్రీన్ మీద ఆయన్ని చూసి మనం నవ్వుకుంటున్నాం కానీ… చిత్ర యూనిట్ కు మాత్రం ఆయన్ని చూస్తే ఒంట్లో జెర్రులు పాకుతున్నట్టు ఉందట. ఆయన అరాచకాల ఎపిసోడ్స్ చాలా కాలంగా కొనసాగుతున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు.