రాజ‌మండ్రి ఘ‌ట‌న‌కు చంద్ర‌బాబే కార‌ణం….ఏపీ సీఎంపై పోలీసుల‌కు ఫిర్యాదు

గోదారి పుష్క‌రాల ప్రారంభం సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు బాధ్యతారాహిత్యంపై విశాఖ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి ఫోరం నేత‌లు డీసీపీ త్రివిక్రమవర్మను క‌లిసి, మొన్న‌టి దుర్ఘ‌ట‌నకు బాబే బాధ్యుడని, త‌క్ష‌ణం ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.చంద్ర‌బాబు రాక రీత్యా పోలీసులు సామాన్య జ‌నాన్ని గంట‌ల త‌ర‌బ‌డి కోట‌గుమ్మం ఘాట్‌లోకి అనుమ‌తించ‌కపోవ‌డం వ‌ల్లే ఈ దారుణం జ‌రిగిపోయింద‌ని వారంతా ఆవేద‌న చెందారు.

మ‌రోవైపు అన్ని పుష్క‌ర ఘాట్ల వ‌ద్ద పోలీసులు భద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసి, ర‌ద్దీని నియంత్రించేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు. డీజీపీ రాముడు బోటుపై ప్ర‌యాణించి, ఘాట్‌లలో భక్తుల రద్దీ, వారి భద్రతను సమీక్షించారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 అనే టోల్‌ఫ్రీ నంబ‌ర్‌కు సంప్రదించాలని అధికారులు కోరారు.