కాంటినెంటల్ ఆధ్వర్యంలో * ఐ యామ్ ఎమర్జెన్సీ రెడీ*
-అత్యవసర వైద్య సేవల్లో కొత్త ఒరవడి
-హైదరాబాద్ బెనెలీ ఓనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
– ప్రాణాలు రక్షించినవారికి *గుడ్ సమారిటన్ అవార్డు*
కాంటినెంటల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఓ విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. * ఐ యామ్ ఎమర్జెన్సీ రెడీ* అనే నినాదంతోఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం వైద్య అత్యవసరాల్లో జరిగే నష్టాన్నిపూడ్చడం.
ప్రముఖ నటుడు ప్రియదర్శి పులికొండ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన టాలివుడ్ లో అనేక చిత్రాల్లో కమెడియన్ గా నటించారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, అవె తదితర చిత్రాల్లో ఆయన నటించారు. హైద్రాబాద్, బెంగళూరు లొకేషన్స్ ఇహెచ్ఎస్ విర్టుసా పొలారిస్, హెడ్ ఫెసిలిటీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ సీనియర్ డైరెక్టర్ కుందన్ ప్రకాశ్, ఐసిఐసిఐ లొంబార్డ్ ఎవిపి మయాంక్ భార్గవ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిరోజు వైద్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇఆర్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహకారంతో హాస్పిటల్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా హాస్పిటల్ బైస్టాండ్ లైఫ్ సపోర్టు (బిఎల్ఎస్)ను శిక్షణ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఇవ్వనుంది. ఆటో డ్రైవర్లు, రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న వ్యాపారులు, స్కూలు విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, సెక్యూరిటీ గార్డులు ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. చివరిరోజు మాత్రం భాగస్వాములైన వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయనున్నారు.
కాంటినెంటల్ హాస్పిటల్ సీఈవో ఫయాస్ సిద్దిఖీ ఈ సందర్భంగా మాట్లాడుతూ * ఐ యామ్ ఎమర్జెన్సీ రెడీ* కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణంగా ఉంది. చాలా అత్యవసర కేసుల్లో రోగికి వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర సమయాల్లో అక్కడ నిల్చున్న వాళ్లు రోగికి వైద్య సేవలు అందించలేకపోతున్నారు. ఈ సందర్భంగా రోగి పరిస్థితి విషమిస్తుంది.
ఈ సమయాల్లో కాంటినెంటల్ హాస్పిటల్ గుడ్ సమారిటన్ అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకుంటున్న వారికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఆగస్టు 19 నుంచి రెండు నెలలపాటు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ముగ్గురు న్యాయనిర్ణేతలు ప్రాణాలు రక్షించిన వారిని గుర్తిస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వీరికి చివరిరోజు రూ 20వేలు ఇచ్చి సత్కరిస్తారు. హైద్రాబాద్ బెనెలీ ఓనర్స్ గ్రూప్ ఈ శిక్షణా కార్యక్రమానికి మద్దత్తు వహిస్తుంది. 20 మంది బెనలీ రైడర్స్ హాస్పిటల్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కల్సి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి సైబర్ టవర్స్ వరకు ఈ ర్యాలీ జరిగింది. బైస్టాండ్ లైఫ్ సపోర్టు శిక్షణా ప్రాధాన్యత గూర్చి ఈ శిక్షణా శిబిరంలో వివరించారు. రోడ్డుప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్య సేవలమీద కూడా శిక్షణ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదాలు వాటిల్లినప్పు డు, గుండెపోటు సంభవించినప్పుడు ఎటువంటి నివారణా పద్దతులు అవలంబించాలో హైద్రాబాద్ బెనెలీ ఓనర్స్ గ్రూప్. తెలియజేసింది. అత్యవసర సమయాల్లో హైద్రాబాద్ నగరం సిద్దంగా ఉందని నిరూపించి సమాజానికి ఎంతో కొంత చేయొచ్చు అని పేర్కొంది