అఖిల్‌కు డ్యాన్స్ నేర్పిస్తున్న నాగ్.. హీరోయిన్ సస్పెన్స్

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ తెరంగ్రేటం చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ఇతర తారాగణం ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్‌కు ఇప్పటికే నటనలో శిక్షణ ఇప్పించిన నాగ్ ప్రస్తుతం డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు.

ప్రస్తుతం సినిమాల్లో డ్యాన్స్‌కు ఉన్న ప్రాముఖ్యంతో పాటు యువహీరోలందరూ డ్యాన్స్‌లో మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. అందువల్ల అఖిల్ కూడా డ్యాన్స్‌లో సత్తా చాటాలని అందుకోసం ఎప్పటినుంచో నాగ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ అఖిల్‌కు శిక్షణ ఇప్పిస్తున్నాడట. ఈ సినిమా నవంబర్ 15న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో నెలకొన్న సస్పెన్స్ ఇంకా తొలగలేదు. తొలుత వినపడిన రాశీఖన్నా పేరునే చివరకు ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.