బెండు తీస్తున్న దండుపాళ్యం 3..

బాలీవుడ్ లో ధూమ్ సిరీస్ మాదిరి ఇక్క‌డ కూడా దండుపాళ్యం సిరీస్ వ‌స్తుంది. ఇప్ప‌టికే ఈ ఖాతాలో రెండు సినిమాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు మూడో భాగం కూడా వ‌స్తుంది. దండుపాళ్యం 3 ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు. దీనికి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి స్టార్స్ కూడా షాక్ అవుతున్నారు. తొలి రెండు భాగాల‌తో పోలిస్తే మూడో భాగాన్ని మ‌రింత రియ‌లెస్టిక్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస రాజు. నాలుగేళ్ల‌ కింద వ‌చ్చిన దండుపాళ్యం సంచ‌ల‌నం సృష్టించింది. హ‌త్య‌లు చేస్తూ.. అత్యాచారాలు చేస్తూ సాగిపోయే ఓ గ్యాంగ్ క‌థ ఇది. క‌ర్ణాట‌క‌లో ఈ చిత్రం సృష్టించిన సంచ‌ల‌నం మాట‌ల్లో చెప్ప‌లేం. తెలుగులో కూడా దండుపాళ్యం ప‌ర్లేద‌నిపించింది. ఈ సినిమాకు ఇదివర‌కే ఓ సీక్వెల్ వ‌చ్చింది. దండుపాళ్యం 2 కూడా బాగానే విజ‌యం సాధించింది. 

ఇక ఇప్పుడు పార్ట్ 3 కూడా సిద్ధం చేసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శ్రీ‌నివాస్ రాజే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. తాజాగా విడుద‌లైంది దండుపాళ్యం 3 ట్రైల‌ర్. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మామూలుగా పెర‌గ‌వు. తొలి రెండు భాగాల‌తో పోలిస్తే మూడో పార్ట్ లో స్టార్ క్యాస్ట్ కూడా పెంచేసాడు శ్రీ‌నివాస్ రాజు. సంజ‌న మ‌రోసారి ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఈమె పూర్తిగా డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో న‌టించింది. ర‌విశంక‌ర్ పోలీస్ పాత్ర‌లో కొన‌సాగాడు. మొత్తానికి ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్పుడు క‌ర్ణాట‌క‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది.