దర్పణం మూవీ రివ్యూ…..

ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టాలంటే ట్విస్టులు, టర్నలతో కూడిన కథ, కథనం తప్పనిసరి. నేటి యువతరం కూడా అదే తరహా కథ కథనాల్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. అందుకే దర్పణం టీం ఆ తరహా కథను ఎంచుకుంది. తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మించిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం’.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన లభించింది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే

కార్తీక్(తనిష్క్ రెడ్డి) తన ముగ్గురు మిత్రలతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ హ్యీపీగా బతికేస్తుంటాడు. అందులో భాగంగా ఓ రోజు ఓ పెద్ద బంగ్లాలోకి దొంగతనానికి వెళతారు. అయితే అక్కడ ఓ నలుగురు కావ్య( శుభంగిపంత్‌)తో సహా దారుణంగా హత్యకు గురై.. విగత జీవులుగా పడి వుంటారు. అందులో ఆ ఇంటి పెద్ద కొనవూపిరితో వుండగా అతన్ని రక్షించాలని కార్తీక్ అనుకంటారు. అయితే.. తోటి స్నేహితులు మొదట తాము వొచ్చిన దొంగతనం చేసేసి అక్కడి నుంచి బయట పడదాం.. లేకుంటే మన మీదకు వస్తుందని చెప్పడంతో… ఆ పెద్దాయన చావు ఆర్తనాదాలు పట్టించుకోకుండా దొంగతనం చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే.. కార్తీక్ ప్రేమించిన మధు(ఎలక్సియస్‌)ను ఓ దెయ్యం వెంటాడుతూ వుంటుంది. అలానే కార్తీక్ తో సహా తన స్నేహితుంలదరినీ వెంటాడుతూ వుంటుంది. మరి ఆ నలుగురిని అంత కిరాతకంగా చంపింది ఎవరు? వీరిని వెంటాడే దెయ్యం ఎవరు? వీటన్నింటినీ పోలీసులు ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ.

సమీక్ష

చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప విభిన్నమైన కథ, కథనం ఎంచుకున్నాడు. గ్రిప్పింగ్ గా సాగుతుంది. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా అనే ఉత్సుకత క్రియేట్ చేయగలిగాడు. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. – అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్‌ మిస్టరీలో లాక్‌ అయితే దాన్ని ఎలా ఛేదించాడు? ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. సినిమా మొత్తం ఒక మర్డర్‌ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. సెకండ్‌ హాఫ్‌ కి వచ్చే సరికి ట్విస్ట్‌లు, టర్నులతో భయపెడుతుంది. ఈ సినిమాలో సెల్లార్‌లో ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అది ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సతీష్‌ ముత్యాల గారి కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే ఈ సినిమాలో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ హైలెట్‌గా ఉంటుంది. హార్రర్ ఎలిమెంట్స్ ని బాగా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా సినిమాని నిర్మించారు. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. కెమెరామెన్ సతీష్‌ముత్యాల తనదైన విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కథకు తగ్గట్టుగా టింట్ డిజైన్ చేశాడు. లైటింగ్ సెన్స్ చాలా బాగుంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాగుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్దార్ధ్‌ సదాశివుని పాటలు బాగున్నాయి. వీటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. రీ రికార్డింగ్ తో చాలా సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేస్తుంది. దర్శకుడు డైరెక్టుగా పాయింట్ లోకి వెళ్లి.. మర్డర్ మిస్టరీ కోణంలో కథ.. కథనాలను నడిపించారు. సరదాగా దొంగతనాలు చేసే కుర్రాళ్లు క్రైమ్ థ్రిల్లర్ లో ఎలా ఇన్ వాల్వ్ అయ్యారనే దాన్ని చాలా తొందరగానే రివీల్ చేయకుండా చివరిదాకా సస్పెన్స్ ను కొనసాగించి… ప్రేక్షకుల్లో ఆ క్యూరియాసిటీని పెంచారు. మనం రోజూ చూసే.. కొంత మంది అబ్బాయిలు.. అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా వేధించడం.. తోటి వారితో క్లోజ్ గా వుంటే శాడిజం చూపించడం లాంటివి తరచుగా చూస్తుంటాం. అలాంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని దర్పణం చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించడం చాలా థ్రిల్లింగ్ గా వుంది. ఓ వైపు మర్డర్ మిష్టరీని కొనసాగిస్తూనే.. మరో వైపు హారర్ తో భయపెట్టడం ఆడియన్స్ ను ఎంతో థ్రిల్ చేస్తుంది.

తనిష్క్ రెడ్డి నటన హైలైట్ గా ఉంటుంది. పాత్రకు సరిగ్గా సరిపోయాడు. కథను తన భుజాలమీదేసుకున్నాడు. ప్రతీ సీన్ లోనూ మంచి నటన కనబరిచాడు. ఈ సినిమా తనిష్క్ కు మంచి పేరు తీసుకొస్తుంది. డైలాగు డెలివరిలోనూ.. డ్యాన్స్ లు వేయడంలోనూ తన ప్రతిభను చూపారు. అతనితో పాటు నటించిన ముగ్గురు స్నేహితులు కూడా చాలా సరదాగా నటించి మెప్పించారు. హీరోయిన్స్ అలెక్సిస్, శుభంగి పంత్ పాత్రలు బాగున్నాయి. ఈ ఇద్దరి పాత్రలకు మంచి పేరొస్తుంది. ఈ సినిమాలో ‘అబి’ అనే నెగటివ్‌ క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. దెయ్యంగా నటించిన శుభంగి పంత్ చాలా ఎనర్జిటిక్ గా నటించింది. అలానే హీరోయిన్ ఎలక్సియస్ కూడా గ్లామర్ డాల్ గా నటించి ఆకట్టుకుంది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్ ఎఫెక్ట్ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ జోనర్స్ కి ఖర్చు పెట్టాల్సినంత పెట్టేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా……
దర్శకుడు రామకృష్ణ రాసుకున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ప్లాట్ బాగుంది. కథనం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చేసేయండి.

PB Rating : 3.25/5