దర్శకరత్న దాసరి పితృదేవోభవ

దర్శక రత్న దాసరి సినిమా చేస్తున్నాడంటే ఆక్రేజే వేరు. 150కి పైగా సినిమాలుచేసిన ఆయన చాలా కాలంగా వెనకబడ్డారు. నేటితరం దర్శకుల ట్రెండ్ ను.. ప్రేక్షకుల టేస్ట్ కు దూరంగా సినిమాలు చేస్తూ ఫాం కోల్పోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పరమవీర చక్ర అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఓ వైపు బొగ్గు కుంభకోణం మరోవైపు పరాజయాల వెల్లువతో ఆయన ఈ సారి బర్త్ డే చేసుకుంటున్నారు. 

70వ బర్త్ డేజరుపుకుంటున్న దాసరి మాట్లాడుతూ… పరమవీర చక్ర మంచి సినిమా. కానీ పరాజయం అయింది. బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా తర్వాత వడ్డీకాసులవాడు అనే స్క్రిప్ట్ రెడీ చేశాను. రాష్ట్ర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేశాను. కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. రాష్ట్ర విభజన జరిగిపోయింది. సో… ఆసినిమా చేసినా లాభం లేదని ఆపేశాను. ఆ తర్వాత పితృదేవోభవ అనే మంచి కథ రాశాం. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాను. అని అన్నారు.