గడ్డి తింటున్న నిర్మాతలపై దాసరి ఫైర్

హీరోల డేట్ల కోసం నిర్మాతలు ఎలాంటి గడ్డితినడానికైనా సిద్ధపడుతున్నారు. నిర్మాత అనే వ్యక్తి అర్థాన్నేమార్చేశారంటూ దర్శకరత్న దాసరి ఫైర్ అయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా తాత-మనవడు. ఈ చిత్రాన్ని నిర్మించింది ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవ. మార్చి 23కి ఈ సినిమా 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా యువకళావాహిని ఆధ్వర్యంలో నిర్మాత రాఘవను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో దాసరి ఘాటుగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ… అప్పట్లో నిర్మాత ముందు హీరోలు చేతులు కట్టుకొని నిలబడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మీడియేటర్లు, క్యాషియర్లు, మేనేజర్లు రాజ్యమేలుతున్నారు. నిర్మాత అనే వారికి గౌరవం లేకుండా పోయింది. నిర్మాతలు కూడా హీరోల డేట్ల కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా సిద్ధపడుతున్నారు. డేట్లు ఇస్తే చాలు కోట్లు సంపాదించేయ్యొచ్చనే భ్రమల్లో బతుకున్నారు. ఈ పరిస్థితి మారాలి. అని అన్నారు.