షాక్ ఇస్తున్న కామ్రేడ్ కలెక్షన్స్…

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా టాప్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన ద్వారకా సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వెంటనే గీతగోవిందం, టాక్సీ వాలా సినిమాలతో మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. నోట సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాతో ఒకేసారి ఏకంగా 60 కోట్ల మార్కెట్ సొంతం చేసుకొని స్టార్ హీరోలకు కూడా నిద్ర లేకుండా చేశాడు విజయ్. ఇలాంటి సమయంలో ఈయన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఆకాశమంత అంచనాలతో విడుదలైంది. కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అందరిలోనూ ఆసక్తి ఉంది. దానికి తోడు స్టూడెంట్ పాలిటిక్స్.. కాలేజీ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో డియర్ కామ్రేడ్ ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్మాడు విజయ్ దేవరకొండ. కానీ ఆయన నమ్మకం ఊహించని విధంగా వమ్ము అయిపోయింది. సినిమా చాలా నెమ్మదిగా ఉండటం.. దానికి తోడు నిడివి కూడా భారీగా ఉండటంతో డియర్ కామ్రేడ్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ ప్రభావం కలెక్షన్లపై కూడా కనిపిస్తుంది. 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్లు వసూలు చేసింది. 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ అంత వసూలు చేయడం అనేది ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల సినిమా నెమ్మదించింది. దానికి తోడు ఇతర భాషల్లో డియర్ కామ్రేడ్ ఆకట్టుకోలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంత ప్రమోషన్ చేసినా కూడా పెద్దగా హెల్ప్ కాలేదు. మొత్తానికి ఎటు చూసుకున్న కూడా చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకు డియర్ కామ్రేడ్ రూపంలో భారీ షాక్ తగిలింది. ఇకపై ఈయన చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.