తిరుపతితో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. జనవరి 14న ఢిల్లీ శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జనవరి 21. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 24. ఫిబ్రవరి 7న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి, కోటి ముప్పై లక్షల మంది ఓటర్లు ఢిల్లీలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 17,763 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలిపారు.

దీంతో పాటు తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు నగారా మోగింది.
19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 27 నామినేషన్లకు చివరి తేది. 13న పోలింగ్ జరుగుతుంది. 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల కోసం పటిష్ట భద్రా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.