ఆప్‌కు మ‌రో షాక్‌…క‌బ్జా కేసులో ఎమ్మెల్యే అరెస్టు

సామాన్యుడి పార్టీపై అడుగడుగునా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో సొంతంగా స‌ర్కార్ ఏర్పాటుచేసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ కేంద్రం వెర్స‌స్ కేజ్రీ అన్న‌ట్లుగానే పాల‌న సాగుతోంది. అంతేకాదు ఆమ్ ఆద్మీ నేత‌లు కూడా వ‌రుస‌గా వివాదాల్లో చిక్కుకుంటున్న‌రు. తాజాగా.. ఆ.. పార్టీకి చెందిన కొండ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌ను ఓ భూవివాదంలో నిందితుడిగా పేర్కొంటూ.. న్యూ అశోక్ న‌గ‌ర్ పోలీసులు అరెస్టుచేశారు.

అనంత‌రం ఆయ‌న‌ను ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రో సాలిటన్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. మ‌నోజ్‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని పోలీసులు చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు రెండురోజుల పాటు విచార‌ణ‌కు న్యాయ‌స్థానం అనుమ‌తించింది. కాగా.. గత సంవత్సం నమోదైన కేసు విషయంలో ఇప్పుడు అరెస్టు చెయ్యడం ఏమిట‌ని, క‌చ్ఛితంగా ఇది విప‌క్షాల కుట్రే అని.. ఆప్ నాయకులు మండిపడుతున్నారు.