పూరి జగన్నాథ్ చెంప చెళ్లుమనిపిస్తా: దేశపతి వార్నింగ్

టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ చెంప చెళ్లుమనిపిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓఎస్డీ, ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. పూరి తన సినిమాల ద్వారా సమాజానికి చెడు సందేశాలు ఇస్తున్నారని దేశపతి అన్నారు. సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో తెలంగాణ పునర్‌నిర్మాణం-అభివృద్ధి అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన పైవిధంగా స్పందించారు. సమాజాన్ని బాగుచేయాలని సినిమాలు తీస్తే చంకనాకిపోతారని మాట్లాడిన పూరి తన ముందుకు వస్తే చెంప పగలగొడతానన్నారు. స్త్రీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అవమానపరుస్తూ సీమాంధ్ర డైరెక్టర్లు బలాదూర్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మానుకోకపోతే వారికి గుణపాఠం తప్పదన్నారు.