దానికోసం దేనికైనా రెడీ అంటున్న రెజీనా..

ఓ సారి రెచ్చిపోయిన త‌ర్వాత‌.. ఒక‌సారైతే ఏంటి మ‌ళ్లీ మ‌ళ్లీ అయితే ఏంటి అనుకుంటుంది రెజీనా. అందుకే బ‌య‌టికి ఎక్కడికి వ‌చ్చినా.. ఏ మాత్రం అందాలు దాచుకోవ‌డం లేదు. ఎండ‌లో ఒడియాలు ఆర‌బోసిన‌ట్లు.. కెమెరాల‌కు అందాలు ఆరబోస్తుంది. ఆ మ‌ధ్య‌ జ‌రిగిన శౌర్య స‌క్సెస్ మీట్ లోనూ ఎక్స్ పోజింగ్ తో అంద‌రి క‌ళ్లు త‌న‌వైపు తిప్పుకుంది ఈ భామ‌. ప‌ద్దతిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తూనే.. కెమెరాల‌కు న‌డుమందాలు అరువిచ్చేసింది రెజీనా. ఈ మ‌ధ్య కాలంలో రెజీనా ఇలా రెచ్చిపోవ‌డం తొలిసారేం కాదు.

మొన్నటికి మొన్న ఐఫాలో అగ్నిప‌ర్వతం బ‌ద్ధలైన‌పుడు వ‌చ్చిన లావాలా.. ఒక్కసారిగా రెచ్చిపోయింది రెజీనా. తాను ఓ సౌత్ హీరోయిన్ అనే సంగ‌తే మ‌ర్చిపోయింది ఈ భామ‌. ఇంట‌ర్నేష‌న‌ల్ ఈవెంట్ క‌నిపించే స‌రికి ఏకంగా ఇంట‌ర్నేష‌న‌ల్ హీరోయిన్ లాగే ఫీలై పోయింది. అందుకే హాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా త‌ల‌ద‌న్నేలా హాట్ షోతో మ‌తులు పోగొట్టింది ఈ త‌మిళ పొన్ను. అంతేకాదు.. శౌర్య ఆడియో వేడుక‌లోనూ బ్లాక్ డ్ర‌స్ లో మోకాళ్ల పైకి డ్ర‌స్ వేసుకుని సెగ‌లు పుట్టించింది రెజీనా.

ఐఫాలో ఎంత‌మంది ముద్దుగుమ్మ‌లైనా ఎక్స్ పోజింగ్ చేసుండొచ్చు.. ఎంత‌మందైనా క్లీవేజ్ షోలు చేసుండొచ్చు.. కానీ అవ‌న్నీ రెజీనా త‌ర్వాతే. అమ్మో.. ఏంటా తెగింపు. అస‌లు ఒంటిమీద బ‌ట్ట‌లున్నాయా లేవా అన్న‌ట్లు ఓ చిన్ని ఉల్లిపొర‌ను క‌ప్పుకొచ్చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు కృష్ణ‌వంశీ సినిమా కోసం ఏకంగా బికినీ వేసుకోడానికి సిద్ధ‌మైపోయింది రెజీనా. సందీప్ కిష‌న్ హీరోగా న‌క్ష‌త్రం సినిమా చేస్తున్నాడు క్రియేటివ్ డైరెక్ట‌ర్. అస‌లే హీరోయిన్ల అందాల్ని చూపించ‌డంలో కృష్ణ‌వంశీ కెమెరా క‌న్ను ఓ అడుగు ముందే ఉంటుంది. ఇక ఇప్పుడు రెజీనా బికీనీ అందాల్ని కూడా కేవీ చూపించ‌బోతున్నాడు. మొత్తానికి మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి బికినీ అయినా రెజీనాకు క‌లిసొస్తుందో లేదో..?