ఫిబ్రవరిలో ధనుష్ ‘లోకల్ బాయ్’

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్  డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ధనుష్ ముందుంటారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో చక్కటి సినిమాతో ‘లోకల్ బాయ్’గా వస్తున్నారు.

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. జనవరి నెలాఖరున విడుదలకు సిద్ధమైన ‘అశ్వద్ధామ’లో కూడా ఆమె నటించారు. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.

ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు సతీష్ కుమార్ తెలిపారు.

నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. తమిళంలో సంక్రాంతికి విడుదలైంది. సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ధనుష్ నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్… సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ధర్మ యోగి’ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి,
ఆడియో: లహరి మ్యూజిక్ ద్వారా విడుదల,
కూర్పు: ప్రకాష్ మబ్బు,
సంగీతం: వివేక్-మెర్విన్,
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్,
కథ – స్ర్కీన్‌ప్ల

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి,
ఆడియో: లహరి మ్యూజిక్ ద్వారా విడుదల,
కూర్పు: ప్రకాష్ మబ్బు,
సంగీతం: వివేక్-మెర్విన్,
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్,
కథ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం: ఆర్‌.ఎస్. దురై సెంథిల్ కుమార్,
తెలుగులో విడుదల: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
 
—————————————
 
Dhanush’s ‘Local Boy’ to release in February
Dhanush has always had a versatile style of his own.  He nailed it in the role of a middle-class man in ‘Raghuvaran B.Tech’.  He impressed everyone as a local don in ‘Maari’.  He was awesome in a dual role in ‘Dharma Yogi’.  Dhanush is always at the forefront of moulding himself as per the character he is playing.  This time, the talented actor is set to entertain the Telugu audience in a new kind of role.

‘Pattas’ (Tamil), directed by RS Durai Senthilkumar, is a Tamil-language martial arts film starring Dhanush as the lead man.  Produced by Senthil Thyagarajan and Arjun Thyagarajan, this one has the ‘Krishnagaadi Veera Prema Gaadha’, ‘Mahanubhavudu’, ‘Raja The Great’, ‘F2’ and ‘Entha Manchivaadavura’ actress Mehreen as the female lead.  Sneha is the other heroine.  Naveen Chandra, who aced with his performance in ‘Aravindha Sametha’ and ‘Evaru’, has another key role in the movie.  Released for Sankranthi, the film became a big hit in Tamil.

The Telugu version, titled ‘Local Boy’, is presented by Smt Jaganmohini on Vigneswara Entertainments.  Produced by Ch Satish Kumar, the film’s First Look, released recently, has received a great response.  The producer has said that ‘Local Boy’ will be released in the first week of February.

Talking about the movie, the producer said, “The film has a martial arts backdrop and is doing tremendously in Tamil.  Dhanush’s performance has been hailed critically.  He took special training to gain grip on martial arts.  The film has familiar faces in its cast and so, you will see it as a straight Telugu movie.  ‘Dharma Yogi’, the director’s movie, was a hit in Telugu.  We are hoping that ‘Local Boy’ will be a bigger hit”.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri

Audio: Lahari Music

Editing: Prakash Mabbu

Music: Vivek-Mervin

Cinematography: Om Prakash

Story, screenplay, direction: RS Durai Senthilkumar

Telugu release is by Vigneswara Entertainments by Ch Satish Kumar

Telugu release is by Vigneswara Entertainments by Ch Satish Kumar

Producers:  Senthil Thyagarajan and Arjun Thyagarajan