ధావన్-రహానే సెంచరీలు.. భారత్ స్కోర్ 363/5

శ్రీలంకతో ఐదువన్డేల సీరిస్‌లో భాగంగా ఆదివారం కటక్‌లో ప్రారంభమైన తొలి వన్డేలో భారత ఓపెనర్లు శిఖర్‌ధావన్, అజ్యంకారహానే సెంచరీలతో కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రహానే 111, ధావన్ 113 పరుగులు చేశారు. రైనా శరవేగంగా కేవలం 34 బంతుల్లోనే 52 పరుగుల చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.