ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరో బుల్లి ధోనీని చూస్తామా..!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. ధోనీ త్వరలో తండ్రి కాబోతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోనీ భార్య సాక్షి ప్రస్తుతం నాలుగో నెల గర్భవతి అని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌లో ఆడని ధోనీ ప్రస్తుతం తన భార్యవద్దే ఉంటున్నాడు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే తొలిటెస్టుకు కూడా ధోనీ అందుబాటులో ఉండడం లేదు. సెలక్టర్లు కూడా ధోనీని ఎంపిక చేయలేదు. 

కుడిచేతి బొటనవేలికి గాయం కావడంతో ప్రస్తుతం ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే మిగిలిన మూడు టెస్టులకు ధోనీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధోనీ భార్య గర్భవతి కావడంతో ధోనీకి మరో బుల్లి ధోనీయే పుడతాడా లేదా అమ్మాయి పుడుతుందా అన్నదానిపై ఫ్యాన్స్ చర్చింకుంటున్నారు. ఏదేమైనా ఈ విషయం తేలాలంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే.