ప్రకాష్ రాజ్ పై డైరెక్టర్స్ యాక్షన్ షురూ

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కష్టాల్లో పడ్డాడు. పడలేదు… తన నోటి దూలతో తానే కష్టాలు కొని తెచ్చుకున్నాడట. అవును ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల ఆగడు అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. కొద్దిరోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే లొకేషన్లో కో డైరెక్టర్ ను బండ బూతులు తిట్టాడట. కేవలం విష్ చేసిందుకే కో డైరెక్టర్ పై దుర్భాషలాడాడట. ఇదంతా చూసిన వారంతో షాక్ అయ్యారట. సదరు కో డైరెక్టర్ వెంటనే డైరెక్టర్స్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకాష్ రాజ్ ని తీసేసే సోనూసూద్ ని పెట్టుకున్నారు. 

అయితే ఈరోజు డైరెక్టర్స్ అసోసియేషన్ ఎమర్జెన్సీ మీటింగ్ కు రమ్మని సభ్యులందరికీ మేసేజ్ పాస్ చేశారు. ప్రకాష్ రాజ్ విషయంలో ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రకాష్ ని బ్యాన్ చేయాల్సిందేనని మెజారిటీ సభ్యులు కోరుతున్నారట. ఇది ప్రకాష్ కి కొత్త కాదట. గతంలోనూ చాలా కంప్లైంట్స్ ప్రకాష్ వచ్చాయి కాబట్టి ప్రకాష్ ని పంపాల్సిందేనని అంటున్నారట.  ఈసాయంత్రానికి ప్రకాష్ టాలీవుడ్ భవిష్యత్తు తేలుతుంది.