`న‌మ‌కం..చ‌మ‌కం..` స్థానంలో కొత్త ప‌దాలు చేరిక‌

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్`. ఈ సినిమా జూన్ 23న విడుద‌లవుతుంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు చాలా హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట‌ల్లో `అస్మైక యోగ త‌స్మైక భోగ‌..` అనే పాట‌లో `న‌మ‌కం..చ‌మ‌కం..` అనే ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని వివాదం చెల‌రేగిన సంగ‌తి విదితమే. ఈ వివాదంపై స్పందించిన చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తగు చ‌ర్య‌లు తీసుకున్నారు. సెన్సార్ స‌మ‌యంలోనే న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను మార్చి వాటి స్థానంలో నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌ను పొందుప‌రిచి సెన్సార్ స‌భ్యుల నుండి అమోదం పొందారు. సినిమాలో, ఇక‌పై రానున్న ఆల్బ‌మ్స్ అన్నింటిలో కొత్త ప‌దాల‌తో కూడిన పాట విన‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.