దొంగ మూవీ రివ్యూ

కార్తీకి తెలుగులో చాలా మంచి మార్కెట్ ఉంది. ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో దొంగ సినిమా గురించి అంతా ఎదురుచూస్తున్నారు. స్ట్రైయిట్ సినిమాలతో పాటు కాంపిటీషన్ లో వస్తున్నప్పటికీ దొంగకు మంచి బజ్ ఉంది. అందులోనూ కార్తీ వదిన జ్యోతికతో కలిసి ఈ సినిమా చేయడంతో అంచనాలు బాగా పెరిగాయి. దృశ్యం సినిమాతో అందరికీ బాగా దగ్గరైన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు డైరెక్టర్. రావురి. వి. శ్రీనివాస్ ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

 

కథేంటంటే:

గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతున్న తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక) ల ఒక సంపన్న కుటుంబంలోకి గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మకై శర్వాగా అతనిని ప్రవేశ పెడతాడు. మరి శర్వా గా జ్ఞాన మూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమైయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞాన మూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

సమీక్ష

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో సాగ్ కథ ఇది. ఈ తరహా కథలు కార్తీకి బాగా నప్పుతాయి. తనకు అచ్చి వచ్చిన జోనర్ లో మరో సినిమా చేసి సక్సెస్ సాధించాడనే చెప్పాలి. కథలో అనేక మలుపులున్నాయి. దీంతో కార్తీకి నటించేందుుక స్కోప్ ఉన్న పాత్ర. ఈ పాత్ర పెద్దగా ఛాలెంజింగ్ కాకపోయినప్పటికీ తన భుజాల మీదేసుకుని కథను ముందుకు నడిపించాడు. దొంగ పాత్రలో సరిగ్గా సరిపోయాడు. పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఒక పెద్దింటికి తప్పిపోయిన కొడుకుగా ప్రవేశించిన దొంగగా, కార్తీ నటన ఆ పాత్రకు రక్తికట్టించింది. ఓ వైపు కామెడీ మరోవైపు యాక్షన్, ఎమోషన్ తో కార్తీ ఇరగదీశాడనే చెప్పాలి. కార్తీ పెర్ పార్మెన్స్ తో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏ కోశాన కూడా అనిపించదు. తెలుగు నిర్మాతలు చాలా కేర్ తీసుకున్నారు. ఈ మూవీలో హీరో కార్తీ తరువాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన శర్వా తండ్రి పాత్ర చేశారు సత్యరాజ్. తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. కార్తీ అక్క పాత్ర చేసిన జ్యోతిక కు మొదటి సగంలో అంత స్క్రీన్ స్పేస్ లభించలేదు. ఐతే పతాక సన్నివేశాలలో వచ్చే ఆమె ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ నిఖిల విమల్ నటన సహజంగా ఉంది. గోవా పోలీస్ పాత్ర చేసిన ఇళవరసి కన్నింగ్ పోలీస్ అధికారిగా మెప్పించారు. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్ గా చిన్నాఅనే పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కామెడీ తో ఆకట్టుకున్నాడు.

డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రేక్షకుల్ని మెల్లగా కథలోకి ఇన్ వాల్వ్ చేశాడు. కామెడీ పార్ట్ ని ప్రథమార్థంలో బాగా డీల్ చేశాడు. సస్పెన్స్ కామెడీ టైమింగ్ తో నడిచే సీన్స్ తో టైం తెలీకుండానే ఫస్టాఫ్ ఫినిష్ చేసాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్సు అంశాలతో ఆకట్టుకొనేలా నడిచింది. ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించిన విధానం బాగుంది. సస్పెన్స్ కు సంబంధించిన సన్నివేశాలు ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడు బయట పెట్టి క్యూరియాసిటీ పెంచాడు. తర్వాతి సన్నివేశం ఏం జరుగుతుందా అన్న ఆసక్తి పెంచాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా ప్లాన్ చేశాడు. సీనియర్ నటి షావుకారు జానకి, సీత కూడా తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు. జ్యోతిక, కార్తీ మధ్య వచ్చే సీన్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఊహించని ట్విస్టుల మధ్య కథ నడుస్తుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ కి కావాల్సినంత మెటీరియల్ ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

గోవింద వసంత పాటలు, ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అందమైన హిల్ ఏరియాలో నడిచిన ఈ చిత్ర సన్నివేశాలను ఆయన చక్కగా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. రెన్సిల్డ్ సిల్వా, సమీర్ అరోరా, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మూవీకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్విస్ట్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. పాయింట్ చిన్నదే అయినా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్ గా….

దొంగ సినిమాతో కార్తీ ప్రేక్షకుల మనసులు దొంగిలించారనే చెప్పాలి. హాస్యంతో పాటు ఆసక్తికరంగా సాగే మలుపులు, సెకండ్ హాఫ్ లో యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు మూవీని చాలా వరకు ఆసక్తిగా నడిపించాయి. సస్పెన్స్ థ్రిల్లర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5