ఏదైనా జరగొచ్చు మూవీ రివ్యూ…

ఏదైనా జరగొచ్చు మూవీ రివ్యూ…

శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా కె. రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుదర్శన్‌ హనగోడు నిర్మించిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. నేషనల్‌ అవార్డు విన్నర్‌, తమిళ స్టార్‌ బాబి సింహ ఈ చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో కనిపించారు.  వైజాగ్‌ సత్యానంద్‌ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్‌  అల్లుడు రవి శివ తేజ కీలక పాత్రల్లో నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథేంటంటే… ముగ్గురు స్నేహితుల కథ ఇది. వీరంతా ఏప్రిల్1 న పుట్టినవాళ్లు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ సందర్భంలో శశి ( పూజ) పరిచయం అవుతుంది. ఆమె సమస్య తీర్చే క్రమంలో సమస్యలు తెచ్చుకుంటారు. కాళీ ( బాబీ) కి చెందిన డెన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆడి ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు. అనేది అసలు కథ.

ఇది ఒక డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌. ఏప్రిల్‌1న పుట్టి స్టుపిడ్‌ పనులు చేసే ముగ్గురి జీవితాలు అనుకోని సంఘటన వల్ల ప్రమాదంలో  పడితే ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు అనే పాయింట్‌తో ఈ కథ రాసుకున్నారు. తెలుగు స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు చూడని లవ్‌ స్టోరీ ఈ సినిమాలో చూస్తారు. జాషువా మాస్టర్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. బాబీ సింహ, అజయ్‌ ఘోష్ క్యారెక్టర్స్‌ అద్భుతంగా వచ్చాయి
మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పెండ్యాల . సందర్భానుసారం వచ్చే సంగీతంతో పాటు ఆర్‌.ఆర్‌ కూడా మిమ్మల్ని మెస్మరైజ్‌ చేస్తుంది’.  విజయ్‌ చాలా బాగా నటించాడు. ఫస్ట్‌ మూవీ అయినా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. సినిమా కథకు తగ్గట్టుగా క్యారెక్టర్ లోకి ఒడిగిపోయాడు. ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారు. కామెడీ టైమింగ్ బాగుంది.

దర్శకుడు కె . రమాకాంత్‌  కథను మలిచిన తీరు చాలా బాగుంది. కొత్త కథ ఇది. ఈ తరహా కథ ఇప్పటివరకు రాలేదు. కథ కోసం ఎంపిక చేసుకున్న పాత్రలు బాగున్నాయి. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. బాబీ సింహ సాషా మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ గా సాగుతాయి. యాక్షన్ పార్ట్ చాలా బాగున్నాయి. సాషా వైభోన్నమైన పాత్రలో కనిపించింది. తన బెస్ట్ పెరఫార్మన్ ఇచ్చింది. పూజ ఉన్నంతలో చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో బాగా నటించింది. దర్శకుడు రామ కాంత్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేసాడు. వెన్నెల కిషోర్ పాత్ర చిన్నదైనా బాగా నవ్వించాడు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ మరో హైలైట్. సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. నిర్మానాత్మక విలువలు చాలా బాగున్నాయి. టెక్నికల్ గా చాలా క్వాలిటీ గా వుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. స్టోరీ కి తగ్గ కలర్స్ ఎంచుకున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎస్ బి ఉద్ధవ్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.

ఫైనల్ గా…
ఏదైనా జరగొచ్చు టైటిల్ కి తగ్గట్టుగా…. కథ కథనం ఉన్నాయి. ఈ టైప్ కథ తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త. అందుకే బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. కొత్త కథ కథనం విజయ్ నటన బాబీ సాషా సీన్స్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తాయి. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5