రీ – రికార్డింగ్ దశలో ఈ మనసే

క్రిషన్ , దీపికా దాస్ , యగ్నస్ హీరో హీరోయిన్ లుగా క్రిషన్ దర్శకత్వంలో శ్రీ  రాజేశ్వరి క్రియేషన్స్ పతాకం పై జి . రాజేశ్వరి, నిమ్మల శ్రీనివాసు నిర్మిస్తున్న చిత్రం ఈ మనసే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటివలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటివలే  డబ్బింగ్ కార్యక్రమాలు కుడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తిచేసుకుని  ఈ చిత్రం  త్వరలో  విడుదల కానున్న సందర్బంగా 

చిత్ర దర్శకుడు క్రిషన్ వివరాలను తెలియచేస్తూ .. ఇటివలే విడుదలైన ఆడియో కి మంచి రెస్పాన్స్ వస్తుంది . పాటలు చాలా బాగున్నాయని అందరు అంటున్నారు . ప్రేమలో కొత్త దానాన్ని ఆవిష్కరిస్తూ  మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా తెరకెక్కించాం .  ఉటీ, కేరళ , కూర్గ్  మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ  చిత్రాన్నిమే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం . ప్రస్తుతం బిజినెస్ పరంగా కుడా మంచి క్రేజ్ ఉంది . అన్నారు. 

చిత్ర నిర్మాత నిమ్మల శ్రీనివాసు  మాట్లాడుతూ .. సినిమా చాలా బాగా వచ్చింది . ఓ మంచి కథను దర్శకుడు అంతకన్నా భాగా చిత్రికరించాడు . ఈ సినిమాకు ప్రధాన హైలెట్ మ్యూజిక్ , ఫోటోగ్రపి. చాలా రోజుల తరువాత వస్తున్నా మంచి మ్యూజికల్  లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ఇదే .  ఎక్కడ కంప్రమైస్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం . త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తి చేసి చిత్రాన్ని మే లో విడుదల చేస్తాం అన్నారు . 

క్రిషన్ , దీపికా దాస్, యగ్నెస్ , దీప , తాగుబోతు రమేష్ , సూర్య , సత్య కృష్ణ , లక్ష్మి నారాయణ , ఎఫ్ ఎం బాబాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కేమెర : శ్రీకర్ బాబు, సంగీతం సుబాష్ ఆనంద్ , ఆర్ట్ : నాని , డాన్స్ : ఆనంద్ , వేణు జోజో , ఎడిటర్ : సొమన్ , ఫైట్స్ : అవినాష్ , రచన సహకారం : చైతన్య , లిరిక్స్ : వెనిగళ్ళ రాంబాబు , ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్ : వి బాలాజీ , జి . దీప,  

నిర్మాతలు  :  జి . రాజేశ్వరి , నిమ్మల శ్రీనివాసు, కథ,  స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం;  క్రిషన్.