ఇక ఆ సినిమాల‌కు స‌మంత దూరం..

స‌మంత‌.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లు దాటేసినా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ లా వెలిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్ప‌డానికి కార‌ణం ఆమె చేసిన సినిమాలు.. అందులో పాత్ర‌లే. ఎక్కువ‌గా ప్రేమికురాలి పాత్ర‌ల్లోనే జీవించింది స‌మంత‌. ప్ర‌తీ సినిమాలోనూ మంచి ల‌వ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మ‌ధ్యే వ‌చ్చిన అ..ఆ..లో త‌న పాత్ర సూప‌ర్ గా పేలిందంటూ సంబ‌ర‌ప‌డిపోతుంది స‌మంత‌. అంతేకాదు.. ఇక‌పై ప్రేమ క‌థ‌లు తాను చేయ‌న‌ని తెగేసి చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికి కార‌ణం అ..ఆ సినిమానే అని చెబుతోంది మాయ‌లేడి.

అ..ఆ..లో త‌న కారెక్ట‌ర్ లో ఎన్ని ర‌కాల ఎమోష‌న్స్ కావాలో అన్నీ పండించాను.. ఇక చేయ‌డానికేం లేదు అంటోంది స‌మంత‌. న‌టి అన్న త‌ర్వాత ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోవాలంటారు. అంతేకానీ ఓ సినిమా చేసిన త‌ర్వాత ఆ పాత్ర‌తోనే త‌న న‌ట‌నా చాతుర్యం మొత్తం అయిపోయింది అంటే అది మంచి న‌టి ల‌క్ష‌ణం కాదేమో స‌మంత గారూ..! ఓ సారి ఆలోచించండి. పైగా హీరోయిన్ ప్రేమ క‌థ‌ల్లో కాక‌పోతే విజ‌య‌శాంతిలా రెచ్చిపోయి ఫైట్లు చేయాలా..? ప‌్రేమ‌క‌థ‌లు చేయ‌ను అని చెబుతోంది స‌మంత‌.. అవి ఎలాంటి ప్రేమ‌క‌థ‌లో మాత్రం క్లారిటీ ఇవ్వ‌ట్లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు నాగ‌చైత‌న్య హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుంది. అందులో స‌మంతే హీరోయిన్. మ‌రి ఇది ప్రేమ‌క‌థ కాదా.. ఇందులో ఎందుకు న‌టిస్తున్న‌ట్లు..? ప‌్రేమ‌క‌థ‌ల్లో న‌టించ‌నంటూ స‌డ‌న్ గా స్టేట్ మెంట్ ఇస్తే అభిమానుల‌కే కాదు.. బ‌య‌టి ప్రేక్ష‌కుల‌కు కూడా ఇలాంటి అనుమానాలే వ‌స్తాయి స‌మంత‌..! కాస్త చూస్కోండి మ‌రి..!