సెన్సార్ పూర్తి చేసుకున్న ‘’ఎందుకో ఏమో” సెప్టెంబర్ 12న భారీ విడుదల

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘’ఎందుకో ఏమో” సినిమా. సెప్టెంబర్ 12 భారీ విడుదలకు సిద్ధం.
మహేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నందు, పునర్నవి భూపాల్, నోయల్ సిన్ లు నటించిన చిత్రం ఎందుకో ఏమో. ఇది ఒక ట్రాయాంగిల్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాకు కోటి వద్దినేని దర్శకత్వం వహించగా, మాలతి వద్దినేని నిర్మించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ తో సెప్టెంబర్ లో విడుదలకు సిద్దం అయింది. ఈ మధ్య విడుదల అయిన ఈ సినిమా టిజర్ కు, ఆడియో కు లక్షల వ్యూస్ తో మంచి స్పందన వస్తుంది. పోసాని కృష్ణ మురళి, మాధవి, భద్రం, నవీన్ నేని, సూర్య, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, మరియు తదితర భారీతారాగణం నటించిన ఈ సినిమాకు సాహిత్యం శ్రీధర్ పల్లె, సంగీతం యెం.జి.కె ప్రవీణ్, ఏడిటర్ మధు, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, కెమెరా జిఏస్ రాజ్ (మురళి) బ్యాగ్రౌండ్ స్కోర్ శేఖర్ చంద్ర నిర్మాత మాలతి వద్దినేని. రచన దర్శకత్వం కోటి వద్దినేని. సెప్టెంబర్ 12 న విడుదల.