ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి స‌మ‌క్షంలో `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` 50రోజుల సెల‌బ్రేష‌న్స్‌

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో హిట్స్ సాధిస్తున్న‌ యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సోషియా థ్రిల్ల‌ర్ మూవీ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించారు. న‌వంబ‌ర్ 18న విడుద‌లై సూప‌ర్బ్ క‌లెక్ష‌న్ల‌తో జ‌న‌వ‌రి 6 నాటికి దాదాపు 28 ధియోట‌ర్స్ లో 50 రోజుల వేడుక పూర్తిచేసుకుంది. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` విడుద‌లైన ఆట నుండి సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అమెరికా నుండి అన‌కాప‌ల్లి వ‌ర‌కు భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. ప్రేక్ష‌కుల వ‌ద్ద చిల్ల‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చినా కంటెంట్ వున్న చిత్రాన్ని అనూహ్యంగా ఆద‌రించారు. ఇలాంటి చిన్న చిత్రాలు పెద్ద విజ‌యాలు సాధిస్తే ముందుగా తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌లో ఆనంద‌ప‌డి ప్రోత్రాహ‌న్నిచ్చే ద‌ర్శ‌క‌గురు, ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయ‌ణ గారు స‌మ‌క్షంలో చిత్ర యూనిట్ అంతా వ‌చ్చి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయ‌ణరావు గారు మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు ఆడిన‌ప్పుడు ఆనందించే వ్య‌క్తుల్లో నేను మెట్ట‌మెద‌టి వాడిని.. మంచి కాన్సెప్ట్ తో బ‌డ్జెట్ ఫిల్మ్ గా చేసిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఇంత పెద్ద ఘ‌న‌విజ‌యం సాధించ‌టం ప‌రిశ్ర‌మ‌కి మంచిది. ఈరోజుల్లో 28 దియోట‌ర్స్ లో 50 రోజులు పూర్తిచేసుకొవ‌టం అంటే మాములు విష‌యం కాదు. ఎప్పుడూ కొత్త చిత్రాలు చేస్తున్న నిఖిల్ కి, ఇలాంటి చిత్రం ద‌ర్శ‌క‌త్వం చేసిన ఆనంద్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. మీడియా ముందు చెప్ప‌టం కాదు నాకు బాగా న‌చ్చిన చిత్రం ఇది. ఈ చిత్రంలో చేసిన పృద్వి, రాజార‌వీంద్ర‌,స‌త్య , సుద‌ర్శ‌న్ అలాగే హీరోయిన్స్ అంద‌రూ చాలా బాగా చేశారు. వీరంద‌రికి మంచి లైఫ్ వుంటుంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి, విజ‌యాలు సాధించాలి.. అని అన్నారు

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మాకు తెలిసి లివింగ్ లెజెండ్ దాస‌రినారాయ‌ణ గారు, ఆయ‌న చిత్రాలు చూసి పెరిగాము. ఇప్ప‌డు కూడా టెలివిజ‌న్ లో వ‌చ్చే చిత్రాలు చూస్తుంటాము. ఇప్ప‌డు జ‌రుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ అప్పుడే దాస‌రి గారు త‌న చిత్రాల్లో చూపించారు., అలాంటి లివింగ్ లెజెండ్ చేతుల మీదుగా మా 50 రోజుల ఫంక్ష‌న్ జ‌రుపుకోవ‌టం చాలా ఆనంద‌గా వుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నమ్మి నిర్మాణం చేప‌ట్టిన మా నిర్మాత వెంటేశ్వ‌రావు గారికి నా ప్ర‌తేఖ ద‌న్య‌వాదాలు. అలాగే ఈరోజు మా చిత్రానికి ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి, పాత్రికేయుల‌కి మా ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో మెట్ట‌మెద‌టి షీల్డ్ ఇది. అదికూడా మా ద‌ర్శ‌కుల గురువు దాస‌రినారాయ‌ణ గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకొవ‌టం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నమ్మి నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన‌ నిర్మాత వెంటేశ్వ‌రావు గారికి నా ప్ర‌తేఖ ద‌న్య‌వాదాలు. అన్నారు.

న‌టుడు రాజా ర‌వీంద్ర మాట్లాడుతూ.. చాలా రోజుల త‌రువాత ఈ చిత్రం లో నేను చేసిన పాత్ర‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది. ఈసినిమా చూసి గురువు గారు దాస‌రి నారాయ‌ణ‌రావు గారు నీకు ఈ సంవ‌త్స‌రం మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని చాలా మంచి పాత్ర చేశాన‌ని ఆశీర్వ‌దించి ఈ షీల్డ్ ని అందిచారు. ఈ సంవ‌త్స‌రం లో నా మెద‌టి గిఫ్ట్ ఇదే అని ఆనంద‌ప‌డుతున్నాను.. అని అన్నారు

స‌త్య మాట్లాడుతూ.. నా లైఫ్ లో నేను తీసుకున్న మెట్ట‌మెద‌టి షీల్డ్ అదికూడా ద‌ర్శ‌క గురువు మా దాస‌రినారాయ‌ణ గారి చేతుల మీదుగా తీసుకునే అదృష్టాన్ని అందించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మా దన్య‌వాదాలు తెలుపుతున్నాను.