దేశవ్యాప్తంగా ఘనంగా ఈస్టర్ వేడుకలు

యేసుక్రీస్తు పునరుత్తాన (ఈస్టర్) పండగను ఆదివారం క్రైస్తవులు ఘనంగా చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో ఈ ఉదయం నుంచే వేడుకలు మొదలు పెట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో  ఈ చర్చికి వచ్చారు.  ఈసందర్భంగా ఆలపించిన గేయాలతో చర్చి ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. శిలువను ఊరేగించారు. ప్రెసిబిటరీ ఇంచార్జి అయిన రెవరెండ్ రాబిన్ సన్ దైవ సందేశాన్నిచ్చారు.