రామోజీ కొత్త బిజినెస్‌…ఈనాడులో నాలుగు కొత్త ఛానెల్స్‌

తెలుగు మీడియా రంగంలో ఈనాడు సృష్టించిన సంచ‌ల‌నాలు అన్ని ఇన్ని కావు. తెలుగు మీడియా రంగంలోనే ఈనాడు ఒక విప్ల‌వం. నాలుగు ద‌శాబ్దాల క్రితం ప్రారంభ‌మైన ఈనాడు దిన‌ప‌త్రిక నేటికి రెండు తెలుగు రాష్ర్టాల‌లో ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత స‌ర్కులేష‌న్‌లో దూసుకెళుతోంది. దాదాపు ఈనాడుకు 18 ల‌క్ష‌ల స‌ర్కులేష‌న్ ఉంది.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఈటీవీ, ఈటీవీ ఏపీ, ఈటీవీ తెలంగాణ ఛానెల్స్ న‌డుపుతున్నరామోజీ గ్రూఫ్ కొత్త‌గా నాలుగు ఛానెల్స్ స్టార్ట్ చేయ‌నుంది. ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈ టీవీ అభిరుచి పేరుతో ఈనాడు ఈ ఛానల్స్‌ను ప్రారంభించబోతోంది.

ఈటీవీ ప్లస్ యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కార్య‌క్ర‌మాలు, ఈటీవీ లైఫ్ ఫ్యామిలీ కార్యక్రమాలతో కుటుంబం, ఆరోగ్యం తదితర అంశాలతో, ఈ టీవీ సినిమాలో కంటిన్యూగా సినిమాలే ప్ర‌సార‌మ‌వుతాయి. ఇక ఈటీవీ అభిరుచిలో వంటలు, హెల్దీ ఫుడ్ తదితర అంశాలకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు ప్ర‌సార‌మ‌వుతాయి.

ఇటీవ‌ల ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ప‌లువురు సినిమా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 27న ఈ విజువల్స్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమాతో పాటు ఈ టీవీ అభిరుచి ఛానల్స్‌ను ప్రారంభించేందుకు రామోజీ గ్రూఫ్ సన్నాహాలు చేస్తోంది.