విస్త‌రిస్తున్న ఈటీవీ సామ్రాజ్యం..

ఈటీవీ.. తెలుగింటి ప్ర‌తీ గ‌డ‌ప‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఛాన‌ల్. గ‌త రెండు ద‌శాబ్దాలుగా తెలుగు లోగిళ్లలో ఈటీవీ సంబ‌రాలు విర‌బూస్తూనే ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈటీవి ఛాన‌ల్స్ బోల‌డెన్ని ఉన్నాయి. తెలుగులో కూడా ఈటీవీతో పాటు ఈటీవీ 2 కూడా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఇక ఇప్పుడు దీని శాఖ‌లు మ‌రిన్ని విస్త‌రించ‌నున్నాయి.

ఈటీవీ నుంచి మ‌రో నాలుగు కొత్త ఛాన‌ల్స్ రాబోతున్నాయి. విజ‌య‌ద‌శ‌మే దీనికి వేదిక కానుంది. మంచి ముహూర్తం చూసుకుని నాలుగు ఛాన‌ల్స్ ని మొద‌లుపెట్ట‌బోతున్నారు ఈటీవీ యాజ‌మాన్యం. ఇప్ప‌టికే న్యూస్ కి ఒక‌టి.. ఎంట‌ర్ టైన్ మెంట్ కు ఒక ఛాన‌ల్ ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త‌గా కామెడీ కోసం ఈటీవీ ప్ల‌స్.. ఆరోగ్యం కోసం ఈటీవీ లైఫ్.. సినిమాల కోసం ఈటీవీ సినిమా.. వంట‌ల కోసం ఈటీవీ అభిరుచి ఛాన‌ల్స్ మొద‌లుకానున్నాయి.

ఇప్ప‌టికే ఈ ఛాన‌ల్స్ కు సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా చాలా వేగంగా జ‌రుగుతుంది. రిక్రూట్ మెంట్ కూడా పూర్తైపోయింద‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 22న నాలుగు ఛాన‌ల్స్ ను ఒకేసారి ఎయిర్ చేయ‌నున్నారు యాజ‌మాన్యం. ఇప్ప‌టికే లోగోలు, డిజైనింగ్ లు, గ్రాఫిక్స్ అన్నీ పూర్త‌య్యాయి. ఇక విజ‌య‌ద‌శ‌మి రోజు ఛాన‌ల్స్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డ‌మే త‌రువాయి. మ‌రి చూడాలి.. ఈ నాలుగు ఛాన‌ల్స్ వీక్ష‌కుల‌పై ఎలాంటి ముద్ర వేయ‌నున్నాయో..?