రామోజీరావు ఖాతాలో మరో రెండు కొత్త ఛానెల్స్…ముహూర్తం ఖరారు

రామోజీరావుకు చెందిన ఈటీవీ నెట్ వర్క్ త్వరలోనే మరో రెండు ఛానెల్స్ ప్రారంభించనుంది. ఇప్పటికే ఈటీవి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెల్స్ తో దూసుకెళ్తోంది. దీంతో పాటు మరో రెండు ఛానెల్స్ ప్రారంభించి ఈటీవీ నెట్ వర్క్ ను మరింత విస్తరించనున్నారు. ఉగాది పర్వదినాన ఈ ఛానెల్స్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ కొత్త ఛానెల్స్ లో ప్రసారం చేయబోయే కంటెంట్ కూడా సిద్ధం చేశారు. సినిమాలు, సీరియళ్లతో పాటు, గేమ్ షోలు, సెలెబ్రిటీ షోస్ వంటి వైవిధ్యమైన కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఈటీవీ లైఫ్ హెల్త్ ఛానెల్ గా మనముందుకు రానుంది.