ఇంటర్వ్యూ : వద్దన్నా పటాస్ కథనే పట్టుకొని తిరిగాను – పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

కళ్యాణ్ రామ్ పటాస్ ఎలా ఉండబోతోంది…
పక్కా కమర్షియల్ పోలీస్ స్టోరీ. కొత్తగా ఉంటుంది. పోలీస్ స్టోరీల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ తరహా పోలీస్ స్టోరీ తెలుగు ప్రేక్షకులు చూడలేదు. యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి. హీరో, విలన్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా ఉంటాయి. కళ్యాణ్ రామ్ గారు డ్యాన్సులు కూడా ఇరగదీశారు.   
 
ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత గబ్బర్ సింగ్ తో పోలుస్తున్నారు…
గబ్బర్ సింగ్ చిత్రానికి పటాస్ కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫ్లేవర్ కూడా ఉండదు. పటాస్ సినిమా కళ్యాణ్ రామ్ గారికి కొత్తగా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ నే టార్గెట్ చేసి రూపొందించాం.

బాలకృష్ణ రౌడీ ఇన్ స్పెక్టర్ సూపర్ హిట్టయ్యింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు పటాస్ లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ సినిమాను ఇనిస్పిరేషన్ గా తీసుకున్నారా.  
నేను ఎప్పుడు కూడా స్టార్ హీరోతో పనిచేస్తున్నాననే ఆటిట్యూడ్ తో సినిమా చేయలేదు. కథ మీద క్యారెక్టర్స్ మీద నమ్మకం ఉంచానంతే. ఓ పోలీస్ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పాం. కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. డైలాగ్ డెలివరీ విభిన్నంగా ఉంటుంది.

బాలకృష్ణ రౌడీ ఇన్ స్పెక్టర్ లోని ఆరె ఓ సాంబా అనే సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ ఆలోచన ఎవరిది. రెస్పాన్స్ ఎలా ఉంది.
ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆ పాటతో సినిమా రేంజ్ కూడా పెరిగింది. బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఓ మ్యాజిక్ చేయాలనుకున్నాం. చేశాం. ఈ జెనరేషన్ లో బాలకృష్ణ గారి సాంగ్ రీమిక్స్ చేయలేదు. అందుకే చేయాలనిపించింది. కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాం.

మీకిది ఫస్ట్ సినిమా. కళ్యాణ్ రామ్ ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు. ఈ కథ కోసం ఎలా కన్విన్స్ చేశారు..
దీని వెనక ఓ కామెడీ కహానీ ఉంది. 2012లో నేను ఈ కథ రాసుకున్నాను. ఓం సినిమా టైంలో కళ్యాణ్ రామ్ గారిని కలిశాను. కథ ఆయనకు బాగా నచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. మంచి కమర్ఖియల్ డైరెక్టర్ ఆవుతావని మెచ్చుకున్నారు. కానీ ఆయన సినిమా మాత్రం చేయనన్నారు. నేను షాక్ అయ్యాను. అయితే ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీయార్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. అయితే నేను మాత్రం ఆ కథ కళ్యాణ్ రామ్ గారితో మాత్రమే చేస్తానని చెప్పి వెళ్లిపోయాను. ఫస్ట్ సినిమా పెద్ద హీరోతో చేయడం నాకు ఇష్టం లేదు. కంఫర్ట్ గా ఉండదని నా ఫీలింగ్. కళ్యాణ్ రామ్ గారయితే కంఫర్ట్ గా చేయొచ్చని ఫీలయ్యాను. అందుకే చాలా సంవత్సరాలు వెయిట్ చేసి కళ్యాణ్ గారితోనే సినిమా చేశాను. నేను అప్పుడు ఏ కథ అయితే చెప్పానో… ఎలాంటి మార్పులు లేకుండా పటాస్ రూపొందించాం.

ఎన్టీయార్ టెంపర్ కు పటాస్ స్టోరీకి పోలీకలున్నాయనే టాక్ వచ్చింది.
రెండు వేరు వేరు జోనర్ ఫిలింస్. నాకు టెంపర్ కథ తెలీదు. పోలీస్ స్టోరీలు కావడంతో ఆ పోలిక వచ్చి ఉండొచ్చు. కమర్షియల్ సినిమాలన్నీ ఒకే లైన్ లో ఉంటాయి. ట్రీట్ మెంట్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. టెంపర్ కథకు, పటాస్ స్టోరీకి సంబంధం లేదు.

సాయి కార్తిక్ మ్యూజిక్ గురించి చెప్పండి..
సాయి కార్తిక్ నేను అనుకున్న దానికంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేను మణిశర్మ, తమన్ అయితే బాగుంటుందని ముందు అనుకున్నాను. అయితే కళ్యాణ్ రామ్ గారు సాయి కార్తిక్ దగ్గరికి పంపించారు. కానీ ఒత్తిడి చేయలేదు. సాయి కార్తిక్ ట్యూన్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుందామే ఆప్పన్ కూడా ఇచ్చారు. సాయి కార్తిక్ స్టూడియోలో ట్యూన్స్ విన్నాను. వినగానే వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాకు పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అవుతుంది.

పెద్ద రేంజ్ సినిమా అవుతుందని అనుకున్నప్పుడు కొత్త హీరోయిన్ ను ఎందుకు తీసుకున్నారు.  
మేం ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని డిసైడ్ అయ్యాం. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. కళ్యాణ్ రామ్ గారి మార్కెట్ ను దృష్టిలో ఉంచుకునే క్యాస్టింగ్ చేశాం. హీరోయిన్ ను బడ్జెట్ ప్రకారమే సెలెక్ట్ చేసుకున్నాం. శృతీ సోధి తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసింది. చాలా బాగా చేసింది. శృతీకి ఈ సినిమాతో మంచి పేరొస్తుంది.

చాలా మంది రచయితలు స్టోరీలు బాగానే రాసుకుంటున్నా డైరెక్షన్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు. మరి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు.
నేను రైటర్ గా పనిచేస్తూనే కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. సో…రెండింట్లోనూ కాస్త అనుభవం సంపాదించాను. అందుకే అటు రచయితగా ఇటు దర్శకుడిగా బ్యాలెన్స్ చేయగలిగాను. ఎడిటింగ్ రూంలో మొహమాటం లేకుండా సీన్స్ కట్ చేయగలిగాను. డైరెక్షన్ అనేది మేనేజ్ మెంట్. మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గౌతమ్ ఎస్ ఎస్ సి సినిమాకు పనిచేసిన అనుభవం నాకు బాగా ఉపయోగపడింది. క్వాలిటీతో అనుకున్న బడ్జెట్ తో సినిమా తీసి ప్రొడ్యూసర్ ని సేఫ్ లో ఉంచితే మంచి దర్శకుడని నా ఉద్దేశ్యం.
 
తొలి చిత్రమే కమర్షియల్ ఫార్మాట్ సినిమా తీయాలని ముందే డిసైడ్ అయ్యారా.
దీని వెనక ఓ కథ ఉంది. ఆది సినిమాలో బాబు బాంబు వేయడం చూసి ఇన్ స్పైర్ అయ్యాను. వినాయక్ గారికి ఫ్యాన్ అయ్యాను. తన ఫస్ట్ సినిమా ఆది లాంటి కమర్షియల్ సినిమానే చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే నా ఫస్ట్ సినిమా పటాస్ కథతోనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఫ్యూచర్లో అన్నిరకాల సినిమాలు చేస్తాను. అయితే కామన్ ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకుంటాను. మిణుగురులు లాంటి సినిమా చూడటానికి ఇష్టపడతాను. కానీ అలాంటి సినిమా తీయలేను. నానుంచి పక్కా కమర్షియల్ సినిమాలే వస్తాయి.  

స్టోరీ, హీరో…దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.
స్టోరీనే నమ్ముతాను. కథ రాసుకున్న తర్వాతే హీరోను ఒప్పిస్తాను. మన దగ్గర సరైన కథ లేనప్పుడే హీరోల జోక్యం ఉంటుంది. సినిమా స్టార్ట్ అయినప్పటినుంచి ఎడిటింగ్ టేబుల్ వరకు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. కథ పక్కాగా ఉంటే హీరోలు బాగా సహకరిస్తారు.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.
మాది ఒంగోలు జిల్లా. విజ్ఞాన్ కాలేజ్ లో బిటెక్ కంప్లీట్ చేశాను. నాన్న ఆర్టీసీ డ్రైవర్.

పటాస్ టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎవరిది.
పాటల రచయిత కాసర్ల శ్యాం ఈ టైటిల్ చెప్పాడు. బాగా స్ట్రైకింగ్ గా ఉందనిపించి డిసైడ్ చేశాం. కళ్యాణ్ రామ్ గారికి కూడా బాగా నచ్చింది. అయితే ఆయనకు పాట ఇవ్వలేకపోయాం. సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇచ్చాం.  

జానకి రామ్ గారితో మీ అనుబంధం గురించి చెప్పండి.
జానకి రామ్ గారిని పటాస్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు కలిశాను. వారి ఫ్యామిలీ చాలా లవ్ లీగా ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ. ఆయన చనిపోయారనే న్యూస్ విని షాక్ అయ్యాను. కళ్యాణ్ రామ్ గారు కూడా బాగా అప్ సెట్ అయ్యారు. మంచి మనిషిని కోల్పోయాం.

చివరిగా నందమూరి అభిమానులకు ఏం చెప్తారు.
నందమూరి అభిమానులకు మత్రం పండగే. వాళ్లకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.