ఫలక్ నుమా దాస్ మూవీ రివ్యూ – యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్

ఫ‌ల‌క్‌నుమా దాస్ రివ్యూ… యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్

ఈ మధ్య కాలంలో  ఓ ట్రైలర్ పై అంతగా రెస్పొన్స్ వచ్చిందంటే కారణం అడు ఫలక్ నుమా దాస్ కి మాత్రమే. కొత్త రకమైన రా కంటెంట్ తో ఈ సినిమా రూపొందించారు. విశ్వకి సేన్ ఈ చిత్రానికి హీరో మరియు డైరెక్టర్. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్, విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యానర్ పై  క‌రాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌, మీడియా 9 మ‌నోజ్ కుమార్ నిర్మించారు. విశ్వ‌క్ సేన్‌, తరుణ్ భాస్క‌ర్‌, ఉత్తేజ్‌, స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

సమీక్ష….
ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో యువ‌త‌కు ద‌గ్గరైన విశ్వ‌క్ సేన్ నేడు ఫ‌ల‌క్‌నుమా దాస్ అంటూ ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చాడు. బారా బ‌జే లేసిన‌మా…ఏక్ బ‌జే తిన్న‌మా ఈ ఒక్క డైలాగ్ ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. హీరోగా త‌న జ‌ర్నీని ప్రారంభించిన విశ్వ‌క్ సేన్ ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డ‌మే కాకుండా హీరోగా న‌టించాడు. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగుల‌తో ఫ‌ల‌క్‌నుమా దాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసాడు.

కథ విషయానికి వస్తే….
ఫ‌ల‌క్‌నుమాలో దాస్(విశ్వ‌క్ సేన్) అంటే అంద‌రికి సుప‌రిచిత‌మే. గొడ‌వ‌లంటే ముందుండే దాస్ త‌న చిన్న‌త‌నం నుండి ఫ‌ల‌క్‌నుమాలోనే ఉంటాడు. దీంతో అక్క‌డి స్థానికులు అంద‌రూ దాస్‌ను ఫ‌ల‌క్‌నుమా దాస్ అని పిలుస్తుంటారు. బారా బ‌జే లేసిన‌మా…ఏక్ బ‌జే తిన్న‌మా అన్న త‌ర‌హాలోనే దాస్ జీవ‌న‌శైళి కొన‌సాగుతుంది. అయితే వ‌య‌సు పెరుగుతుంది..ఏదైనా వ్యాపారం చేయాల‌నుకున్న దాస్ త‌న స్నేహితుల‌తో ఓ మ‌ట‌న్ దుకాణం పెడ‌తాడు. అయితే మ‌ట‌న్ దుకాణం పెట్టాలంటే కావాల్సిన సామాగ్రి ర‌వి మ‌రియు రాజు అనే వ్య‌క్తుల వ‌ద్ద దొరుకుతుంది. ఈ క్ర‌మంలో దాస్ అత‌ని స్నేహితులు క‌లిసి ర‌వి, రాజు ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. అంత‌కుముందు దాస్ శంక‌ర‌న్న‌కు పెద్ద ఫ్యాన్. శంక‌ర‌న్న‌నే చూసి పెరిగిన దాస్ ర‌వి,రాజుతో బిజినెస్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు కార‌ణం ఏంటంటే..శంక‌ర‌న్న‌ను చంపింది ఈ ర‌వి, రాజు. దీంతో ఇష్టంలేక‌పోయినా…దాస్ ర‌వి,రాజుతో క‌లుస్తాడు. అయితే ఓ సంద‌ర్భంలో బార్ లో పెద్ద గొడ‌వ‌లో ర‌వి,రాజు బంధువైన బావ‌మ‌రిదిని దాస్ కొడ‌తాడు. ఈ గొడ‌వ‌లో దాస్ ఓ మ‌ర్డ‌ర్ చేయాల్సి వ‌స్తుంది. అనుకోకుండా జ‌రిగిన త‌ప్పు వ‌ల్ల దాస్ జైలుకు వెళ‌తాడు. మ‌రి దాస్ ఆ హ‌త్య ఎందుకు చేశాడు…ఎవ‌ర్ని చేశాడు అన్న‌ది తెలియాలంటే మిగ‌తా భాగం తెర‌మీద చూడాల్సిందే.

ఎనాలిసిస్…
హీరో డైరెక్టర్ విశ్వజ్ సేన్ న్యూ ఏజ్ రా కంటెంట్ తో మెప్పించాడు. హైదరాబాదీ లోకల్ యాస తో రాసిన డైలాగ్స్ ఆడిరిపోయాయి. లోకల్ నెటివిటీ తో దర్శకుడు బాగా తెరకెక్కించాదు. హీరోగా డైరెక్టర్ గా విశ్వకి తన ప్రతాపం చూపంచాడు. దీనికి తగ్గట్టుగా కెమేరా వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడిరిపోయాయి. పాటలు సందర్భానికి తగ్గట్టుగా బాగా కుదిరాయి. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. డైరెక్టర్ సీన్స్ ని బాగా ప్లాన్ చేశారు. హీరో తో పాటు హీరో స్నేహితులకు పంచి పాత్రలు దొరికయి. ఇంటర్వెల్ బాంగ్ అదిరింది. మెయిన్ గా సంభాషణలు చాలా బాగున్నాయి. అక్కడక్కడ క్లాప్స్ తప్పకుండా పడతాయి.

ఫైనల్ గా
ఈ రకమైన సినిమాలు ఎప్పుడో గాని రావు. ఈ తరహా రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా కొన్నేక్టు అవుతుంది. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ ఆడియెన్స్ విజిల్స్ వేయాల్సిందే… సో గో అండ్ వాచ్…

PB Rating : 3/5