బాలయ్య సినిమాకు ఆర్థిక ఇబ్బందులా?

నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికై సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల హడావిడి ముగిసింది కాబట్టి ఆయన నటించబోయే సినిమాల మీద దృష్టి పెట్టనున్నారు. సత్య దర్శకత్వంలో బాలయ్య నటించనున్నాడు. సత్యకు ఇదే తొలిసినిమా. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. చిత్ర నిర్మాతకు నిధులు ఇంకా సమకూరలేదట. ఫైనాన్షియర్స్ ఇంకా ముందుకు రాలేదట. అయితే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని బాలయ్య అభిమానులు కొట్టిపారేస్తున్నారు. 

ఇక నందమూరి బాలకృష్ణ నటించే తాజా చిత్రానికి ముహూర్తం దాదాపు ఖరారయింది. జూన్ 2న ఈ చిత్రం ప్రారంభమౌతుంది. బాలకృష్ణ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. త్రిష లేదా శ్రియ హీరోయిన్ గా నటించే అవకాశముంది. సత్య దర్శకుడిగా పరిచయమౌతున్నఈ చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ చిత్ర నిర్మాత రమణారావ్ నిర్మిస్తారు.