ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో ఫస్ట్ ర్యాంక్ రాజు ట్రైలర్ కు మంచి బజ్ వచ్చింది. యూత్ నిటార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చేతన్‌ మద్దినేని, కౌశిక్‌ ఓరా, సీనియర్ నరేష్, పోసాని త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమార్ దర్శకుడు. డాల్ఫిన్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌ పతాకం పై మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే : చేతన్‌ మద్దినేని (రాజు) చిన్నప్పటి నుండి అతని తండ్రి కారణంగా బట్టి చదువులకు అలవాటు పడి పడి.. చివరికీ ‘విద్య 100% బుద్ధి 0%’ అనే స్థాయికి చేరుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రాజు తన డ్రీంను కూడా నెరవేర్చుకోలేకపోతాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల తరువాత రాజును పూర్తిగా మారుస్తానని ‘రాజు తండ్రి’ ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ రాజు తండ్రి చేసే ఛాలెంజ్ ఏమిటి ? అసలు రాజు తండ్రి (సీనియర్ నరేష్)కి ఎందుకు రాజును అలా పెంచాల్సి వచ్చింది. దాని వల్ల రాజు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు. చివరికీ రాజు విద్య గురించి, జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

సమీక్ష
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. కొత్తగా అనిపిస్తుంది. ఈ పాయింట్ నుగతంలో ఎవ్వరూ టచ్ చేయలేదు. కమర్షియల్ గా దర్శకుడు మలిచిన తీరు చాలా బాగుంది. హీరోగా చేతన్‌ మద్దినేని పాత్రకు సరిగ్గా సరిపోయాడు. పాత్రను తన భుజాల మీదేసుకున్నాడు. పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలచుకున్నాడు. నటన పరంగా ఫల్ మార్కులేయించుకున్నాడు. ముఖ్యంగా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో, ఆలాగే ప్రీ క్లైమాక్స్ లో అలాగే కొన్ని కీలక సీన్స్ లో చేతన్‌ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా నటించాడు.
హీరోయిన్ గా నటించిన కౌశిక్‌ ఓరా బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోకి తండ్రిగా నటించిన సీనియర్ నరేష్, మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్ ఎప్పటిలాగే తమకు మాత్రమే సాధ్యమైన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ , తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్విస్తారు. ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు హీరో పాత్రను బాగా మలిచాడు. చేతన్ లోని నటుడిని బయటికి తీశాడు. హీరో అమాయికత్వానికీ సంబంధించిన సన్నివేశాలను మరియు సీనియర్ నరేష్ హీరోను మార్చే సీన్స్ ను ఫన్నీగా మలిచే ప్రయత్నం చేయడం బాగుంది.

సినిమాలో స్టోరీ పాయింట్ తో పాటు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దర్శకుడు రాసుకున్న విధానం తెరమీద ప్రేక్షకులకు చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి. కథను ఎక్కడా డీవియేట్ చేయలేదు. కామెడీ సన్నివేశాల్ని బాగా చిత్రీకిరించారు. కామెడీ సీన్స్ ని బాగా రాశారు. సినిమా సరదాగా సాగిపోతుంది. టైం తెలీకుండానే సినిమా పూర్తవుతుంది. బోరింగ్ సన్నివేశాలు లేకుండా బాగా ఎడిట్ చేశారు. దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయగలిగాడు. భావోద్వేగానికి సంబంధించిన సన్నివేశాల్ని సైతం బాగా ప్లాన్ చేశారు. ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అవుతుంది.

దర్శకుడు నరేష్‌ కుమార్‌ విద్యా వ్యవస్థకి సంబంధించిన మంచి పాయింట్ ను టచ్ చేశాడు. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. శేఖర్ చంద్రు కెమెరా పనితనంతో ఇంప్రెస్ చేశాడు. విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు కిరణ్ రవీంద్రనాధ్ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ పనితనం కూడా ఆకట్టుకుంది. మంజునాధ్‌ వి. కందుకూర్‌ నిర్మాణ విలువులు బాగున్నాయి.

ఫైనల్ గా…
ఈ తరహా సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందరికీ తెలిసిన పాయింట్ నే వినోదాత్మకంగా చెప్పాడు. విద్యావ్యవస్థను బాగా టచ్ చేశాడు. కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని కామెడీ సన్నివేశల పరంగా బాగా ఆకట్టుకుంటుంది. హీరో చేతన్‌ మద్దినేని – వెన్నెల కిశోర్ కాంబినేషన్ సీన్స్ మరియు పోసానితో నడిచే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. సో… గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5