మే 23న ఫాక్స్ స్టార్ ఎక్స్ మెన్ రిలీజ్

అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలను రూపొందించే అగ్రగామి సంస్థ పాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ అద్భుతం ఎక్స్ మెన్. గతంలో వచ్చిన ఎక్స్ మెన్ సిరీస్ లలో వస్తున్న 7వ చిత్రమిది. తొమ్మిది అద్భుతమైన శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లనుందో వాటిని ముందుగానే పసిగట్టి తొమ్మిది విచిత్రమైన శక్తులు గల వ్యక్తులతో ప్రపంచ ఫీచర్ ను మారుస్తారు. గతంలో వచ్చి న ఎక్స్ మెన్ సిరీస్ లలో అనేక విచిత్రమైన క్యారెక్టర్లని ఒకే చిత్రంలో పొందుపర్చిన చిత్రమిది. 

వోల్వోరిన్, ప్రొఫెసర్, మ్యాగ్ నెటో, మిస్టిక్, స్ట్రోమ్, రోగ్, బీస్ట్, ఐస్ మెన్, బిషప్ వంటి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. 

ప్రపంచ దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ మే 23న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో భారీగా విడుదలకు ముస్తాబు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రతినిథి తెలిపారు. హగ్ జగ్ మెన్, జేమ్స్ మెక్ నోవ్, మైకేల్, ఫెస్టండల్, జెనీఫర్ లారెన్స్, హెల్ మెర్రి మొదలగువారు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం బ్రియన్ సింగర్, నిర్మాణం – ఫాక్స్ స్టార్ స్డూడియోస్ ప్రై.లిమిటెడ్