పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. ఫ్రీ కోచింగ్ డీటెయిల్స్

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రేపర్ అవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. వివిధ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కోచింగ్ కమ్ గైడెన్స్ సెంటర్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.

బ్యాంక్ క్లర్క్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే ఉద్యోగాలు, ఐబీపీఎస్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ఈ శిక్షణ తీసుకోవాలని అనుకుంటే 040-27408555 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు సెంటర్ తరపున 11 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణతో పాటు ప్రతినెలా 500 రూపాయల ఉపకారవేతనం, మరో 500 రూపాయలు పుస్తకాల కోసం మొత్తం వేయి రూపాయల స్టైఫండ్ ఇవ్వనున్నారు.