నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్-2 షూటింగ్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిని గబ్బర్‌సింగ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి కంటిన్యూగా జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్-విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా గోపాలా.. గోపాలా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. 

ఈ సినిమాలో పవన్ సెకండాప్‌లో అరగంట పాటు కనిపించనున్నాడు. పవన్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించారు. పవన్ సీన్లు ఈ నెలాఖరకు పూర్తవుతాయని నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్-2 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. ఎప్పుడో అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో దర్శకుడు సంపత్‌నంది పవన్‌కు ఈ సినిమా కథ చెప్పడంతో పవన్ ఓకే చేశాడు. అప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్‌ను సంపత్‌నంది చేస్తూనే ఉన్నాడు. అయితే పవన్‌కు మాత్రం ఖాళీ ఉండడం లేదు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే సంపత్‌నంది మాత్రం తనకు పవన్ ఎప్పటికైనా అవకాశం ఇస్తాడని ఆశతో అదే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు. దీంతో ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించి నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.