రివ్యూ : గడ్డం గ్యాంగ్ సమీక్ష

యాంగ్రీ యంగ్ మ్యాన్ అని ఇప్పటికీ చెప్పుకునే రాజశేఖర్ కి అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఇప్పుడు అభిమానులు తగ్గినా పాత సినిమాల మీదున్న అభిమానంతో…ఆయన సినిమాల మీద ఓ కన్నేసే ఉంచుతున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన సూదుకవ్వం అనే తమిళ చిత్ర రైట్స్ తీసుకొని గడ్డం గ్యాంగ్ పేరుతో రీమేక్ చేశారు జీవితా రాజశేఖర్. ఈ సినిమా రైట్స్ తీసుకున్నప్పుడే టాలీవుడ్ లో పెద్ద డిస్కషన్ జరిగింది. సూపర్ హిట్ చిత్రాన్ని ఎలా రీమేక్ చేస్తారో అనే చర్చ సర్వత్రా జరిగింది. అయితే అన్ని డిస్కషన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ గడ్డంగ్యాంగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంతోష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షీనా హీరోయిన్. సత్యం రాజేష్, దీపక్, అచ్చు, నోయల్, నాగబాబు, నరేష్, సీత, హోగ్ జాపీ ఇతర క్యారెక్టర్స్ చేశారు. అచ్చు సంగీతమందించాడు.

కథేంటంటే…
గడ్డం దాస్ (రాజశేఖర్) చిన్నా చితగా దందాలు చేస్తుంటాడు. ఫ్రెష్ గా కిడ్పాపులు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడూ తన ఊహసుందరి షాలూ (షీనా)తో మాట్లాడుతుంటాడు. గడ్డం దాస్ కి అనుకోకుండా ఉద్యోగాలు లేని రమేష్ (సత్యం రాజేష్), సురేష్ (అచ్చు), పండు (దీపక్) పరిచయమౌతారు. వీరంతా కలిసి మినిస్టర్ ధర్మరాజు (నరేష్) కొడుకు సత్య హరిశ్చంద్ర (నోయల్)ను కిడ్పాప్ చేస్తారు. 2 కోట్లు డిమాండ్ చేస్తారు. కిడ్నాప్ చేసింది గడ్డం గ్యాంగ్ అయినప్పటికీ…సత్య హరిశ్చంద్ర కూడా కిడ్పాపర్స్ తో చేతులు కలుపుతాడు. మినిస్టర్ నుంచి డబ్బు చేతికందుతుంది. కానీ అనుకోకుండా ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. డబ్బు మాయమవుతుంది. ఇంతకూ ఆ డబ్బు ఎక్కడికెళ్లింది. చివరికి డబ్బు దొరికిందా. గడ్డం గ్యాంగ్ ని మినిస్టర్ పట్టుకోగలిగాడా. మినిస్టర్ కొడుకు కిడ్పాపర్స్ తో ఎందుకు చేతులు కలిపాడు. గడ్డం గ్యాంగ్ చివరికి ఏమైంది. ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే తెరమీదే చూడాలి.

నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే…. డా.రాజశేఖర్ చేయాల్సిన సినిమా కాదు. ఫేస్ లో ఏజ్ బాగా కనిపిస్తోంది. మాస్ యంగ్ హీరో ఈ కథ చేసుంటే బాగుండేది. రాజశేఖర్ నుంచి ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసే హీరోయిజం లేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ కాకపోవడంతో…ఆడియెన్స్ నీరసించిపోతారు. సినిమా మొత్తం రాజశేఖర్ ను గడ్డంతో చూడటం కష్టమే. మెయిన్ గా సెకండాఫ్ లో రాజశేఖర్ హీరోయిజం లేకపోవడం పెద్ద మైనస్. మిగిలిన పాత్రలకు రాజశేఖర్ పాత్రకు పెద్ద తేడా లేకుండా పోయింది. హీరోయిజంకు అలవాటుపడ్డ తెలుగు ఆడియెన్స్ కు రాజశేఖర్ క్యారెక్టర్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. రాజశేఖర్ అంటే సాయికుమార్ డబ్బింగ్ చెప్పాల్సిందే. అయితే ఈసారి ఈ కాంబినేషన్ సరిగ్గా వర్కవుట్ కాలేదు. డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. ఇక షీనా క్యారెక్టరైజేషన్ వెరీ బ్యాడ్. ఊహాసుందరి అంటూ చాలాసేపు ఊరించారు. తొడలు చూపించడానికి తప్ప షీనా క్యారెక్టర్ కు అర్థం లేకుండా పోయింది. పోలీస్ డ్రెస్ వేసినప్పుడు కూడా పొట్టి నెక్కరేసి పరుగెత్తించారు. ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు. మొదటి సినిమానే అయినా బాగా చేశాడు. డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సింది. సత్యం రాజేష్ అలవాటైన పాత్ర పోషించాడు. మరో ఫ్రెండ్ గా నటించిన దీపక్ కూడా బాగానే చేశాడు. మంచి క్యారెక్టర్లు పడే ఛాన్సుంది. ర్యాప్ సింగర్ నోయల్ కు మంచి క్యారెక్టర్ దొరికింది. సత్య హరిశ్చంద్ర క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయాడు. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమైన ఉందంటే అది ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించిన గబ్బర్ సింగ్ (యోగ్ జాపి) గురించి. (సూదుకవ్వంలోనూ యోగ్ జాపీనే పోలీస్ క్యారెక్టర్ చేశాడు). సినిమా మొత్తం మాట్లాడకుండా భయ పెట్టించాడు. ఈయనకు ఒక్క డైలాగ్ కూడా లేదు. సెకండాఫ్ లో వచ్చే ఈ క్యారెక్టర్ సినిమాకు కాస్త రిలీఫ్. పెర్ ఫార్మెన్స్ తో పడిపోయిన సినిమా గ్రాఫ్ ను కాస్త పరుగెత్తించాడు. ఇక మిగిలిన పాత్రల్లో సీత, నరేష్, నాగబాబు, గిరిబాబు, రఘుబాబు అలవాటైన పాత్రల్లో కనిపించారు. ముమైత్ ఖాన్ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ముమైత్ కంటే ఎవరైనా కొత్తవారికి అవకాశం కల్పించి ఉంటే బాగుండేది.

టెక్నికల్ టీం పనితీరు
అచ్చు మ్యూజిక్ డైరెక్షన్ మీద కంటే…యాక్టింగ్ మీదే కాన్ సన్ ట్రేట్ చేసినట్టున్నాడు. పాటలు ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయాడు. అచ్చు గత సినిమాలతో పోల్చితే వీక్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. ఇక ఆర్ ఆర్ విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా పనితనం సినిమా జోనర్ గా తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా లేదు. సినిమా ఆద్యంతం చాలా స్లోగా ఉంది. డైలాగ్స్ ఓకే. అక్కడక్కడ డైలాగ్స్ పేలాయి. అయితే పగలపడి నవ్వేంత, రిపీట్ మోడ్ డైలాగ్స్ మాత్రం లేవు.

డైరెక్షన్ గురించి
ఈ సినిమా డైరెక్షన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే తమిళ సినిమాకు ఫ్రీమేక్ కాబట్టి. ఎగ్జాక్ట్ గా సుదుకవ్వం సినిమానే తెరకెక్కించారు. ఆర్టిస్టులు మారారంతే. తనకిచ్చిన బడ్జెట్ లో డైరెక్టర్ సంతోష్ సినిమా పూర్తి చేశాడు. కథనం మరీ స్టో కావడంతో సీరియల్ ని తలపించింది. ఆర్టిస్టుల డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోకపోవడంతో…తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. టాలీవుడ్ ఆడియెన్స్ ను, తెలుగు నేటివిటీని అస్సలు పట్టించుకోలేదు.  ఎందుకంటే దర్శకుడు తమిళం వ్యక్తి కావడమే. ఎలాగూ రీమేక్ సినిమానే కాబట్టి తెలుగు వ్యక్తికి దర్శకత్వ పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేది. కనీసం తెలుగు సినిమా ఛాయలు కనిపించి కనెక్ట్ అయ్యేవారేమో. ఎంటర్ టైన్ మెంట్ అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి సినిమాలకు కామెడీ ఎంత వర్కవుట్ అయితే అంత బెనిఫిట్. డార్క్ కామెడీ సినిమాలకు ట్విస్టులు, ఎంటర్ టైన్ మెంటే ప్రాణం. చాలా సీన్స్ లెంగ్దీగా బోర్ కొట్టించాయి.

ప్లస్ పాయింట్స్
కథ (క్రెడిట్ గోస్ టూ సూదుకవ్వం టీం)
సినిమాటోగ్రఫి
గబ్బర్ సింగ్ పోలీస్ క్యారెక్టర్
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్
స్లో
ఎంటర్ టైన్ మెంట్
మ్యూజిక్
తెలుగు నేటివిటీ లేకపోవడం
హీరోయిజం

ఫైనల్ గా…
గడ్డం గ్యాంగ్ పేరు పెట్టారు కానీ…రాజశేఖర్ కు తప్ప మిగిలిన వారికి సరిగ్గా గడ్డం కూడా లేదు. తమిళంలో సూపర్ హిట్ అయితే తెలుగులో హిట్టవ్వాలని రూలూ లేదు.. ఫ్లాప్ అవ్వాలనే క్లాజూ లేదు. అయితే డైరెక్ట్ సినిమా కంటే రీమేక్ సినిమాకే సమస్యలెక్కువగా ఉంటాయి. సూదుకవ్వం-గడ్డంగ్యాంగ్ విషయానికి వస్తే అదే జరిగింది. ఆర్టిస్టుల దగ్గరి నుంచి, టేకింగ్ వరకు… నేటివిటీ దగ్గరి నుంచి పబ్లిసిటీ వరకు చాలా తేడాలొచ్చాయి. రీమేక్ సినిమా అనగానే పోలికలు సహజం. అయితే గడ్డం గ్యాంగ్ సినిమాను తమిళ సినిమాతో పోల్చకపోయినా…. సమస్యలెక్కువగా ఉన్నాయి. కథ బాగున్నా…కథనం చాలా కీలకం.  కథ ఆల్రెడీ సూపర్ హిట్టయ్యింది. సమస్యల్లా తెలుగులో ఎలా తీస్తారనేదే. ఫ్రీమేక్ లోనే పప్పులో కాలేశారు. రాజశేఖర్ పవర్ ఫుల్ హీరోయిజం చూపించే సత్తా ఉన్న మాస్ హీరో. అలాంటి మాస్ హీరోను జీరో చేసేశారు. తెలుగు ఆడియెన్స్ కోసం…. క్యారెక్టర్ కు ప్రాణం పోసే విధంగా బిల్డప్ షాట్స్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాను రీమేక్ కాకుండా డబ్బింగ్ చేసుంటే బాగుండేదనే టాక్ వినిపించింది. రాజశేఖర్ అభిమానులైతే… తెలుగు సినిమాను అమితంగా ప్రేమించే వారయితే…థియేటర్ కు వెళ్లి డబ్బులు పెట్టి టిక్కెట్ కొని సినిమా చూడండి. తప్పనిసరిగా చూడాల్సిన సినిమా మాత్రం కాదు.