గేమ్ ఓవర్ మూవీ రివ్యూ

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథేంటంటే: స్వప్న (తాప్సి) ఒక వీడియో గేమ్ డిజైన‌ర్‌. ఆమెకి గేమ్స్ ఆడ‌టమన్నా ఇష్టమే. అనుకోకుండా ఆమె జీవితంలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. అప్పట్నుంచి చీకటంటే భ‌యప‌డుతుంటుంది. త‌ల్లిదండ్రుల‌కి దూరంగా, ప‌ని మనిషి క‌ళ‌మ్మ (వినోదిని వైద్యనాథ‌న్‌)తో క‌లిసి ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. స్వప్న త‌న చేతికి ఒక ప‌చ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ ప‌చ్చబొట్టు రంగులో అమృత (సంచిత న‌ట‌రాజ‌న్‌) అస్తిక‌లు కూడా క‌లుస్తాయి. ఆ ప‌చ్చబొట్టు స్వప్నపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇంత‌కీ అమృత ఎవ‌రు? ఆమె ఎలా చ‌నిపోయింది? అమృత త‌ర‌హాలోనే స్వప్నకి కొన్ని సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే

సమీక్ష
ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. వెన్నులో వణుకు పుట్టించే కథ, కధనాలు ఈ థ్రిల్లర్ మూవీ సొంతం.
ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాల సమాహారం. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ పెంచాడు. ఈ తరహా థ్రిల్లర్ గతం లో మనం చూడలేదు. కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా లెగ్త్ కూడా తక్కువ కావడంతో స్పీడ్ గా అవుతుంది. ఓ వైపు ఆత్మ, మరోవైపు సీరియల్ కిల్లర్డ్స్ తో కథ నడిపించాడు. తాప్సి అద్భుతమైన పెరఫార్మెన్సు చూపించాడు. మానసిక ప‌ర‌మైన సంఘ‌ట‌న‌ల్ని ఇందులో స్పృశించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచే కథలోకి ఇన్ వాల్వ్ చేశాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌తని రేకెత్తిస్తుంది. కిల్లర్స్ ఎవరు అనేసి చెప్పకుండా కథను ఎండ్ చేసి ఆశ్చర్యం కలిగించాడు. కథలొ కల నిజం అనేది సస్పెన్స్ గా చూపించాడు.

తక్కువ పాత్రలతో అంతసేపు సస్పెన్స్ ని మెయింటేన్ చేయడం గొప్ప విషయం. సినిమా అంతా తాప్సీ చుట్టూనే తిరిగుతుంది. తాప్సీ తన పెర్పార్మెన్స్ తో సినిమాను నిలబెట్టింది. చాలా సార్లు తాప్సీ తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా భయపడే సన్నివేశాల్ని చాలా బాగా చేసింది. పని మనిషి కళమ్మ (వినోదిని వైద్యనాథన్) పాత్ర కీలకంగా చెప్పుకోవాలి. దాదాపు సినిమా అంతా ట్రావెల్ అవుతుంది. తాప్సీ కళమ్మ మంచి సింక్ లో చేశారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా పండాయి. అమృత‌ని చంపిన సైకో కిల్లర్లే స్వప్నని ద‌గ్గరికి ఎలా వ‌చ్చారనే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తాప్సీకి వచ్చే కలలతోటి భయపెట్టాడు దర్శకుడు. చివర్లో తాప్సీ పనిమనిషి పాత్రతో కలిసి ఫైట్ చేసే సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే కిల్లర్స్ ఎవరు వారు ఎందుకు చంపుతున్నారనే దాంట్లోకి వెళ్లి దర్శకుడు టైం వేస్ట్ చేయలేదు. ప్రేక్షకులు చాలా తెలివిగలవారు అనే విషయాన్ని మరోసారి నిరూపించాడనిపించింది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టప‌డే ప్రేక్షకులకి అమితంగా న‌చ్చుతుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అశ్విన్‌, కావ్య రామ్‌కుమార్‌లు క‌లిసి క‌థ‌, క‌థ‌నాల్ని రాసుకున్న విధానం మెప్పిస్తుంది. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం, ద్వితీయార్ధంలో రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్‌, ఎ.వసంత్ ఛాయాగ్రహ‌ణం చిత్రానికి ప్రధాన బ‌లం. ఇదివ‌ర‌కు ‘మ‌యూరి’తో ఆక‌ట్టుకున్న దర్శకుడు అశ్విన్, మ‌రోసారి త‌న ప్రత్యేక‌త‌ని ప్రద‌ర్శిస్తూ ఈ సినిమా తీశాడు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి

ఓవరాల్ గా…. ఈ తరహా చిత్రాలు ఎప్పుడోగాని రావు. దర్శకుడు అశ్విన్ మయూరి సినిమా తర్వాత మరోసారి తన ప్రతిభ చూపించాడు. హార్రర్, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాల్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడి టాలెంట్ కు తగ్గట్టుగా తాప్సీ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. టాటూ చుట్టూ ఈ తరహా కథను గతంలో ఎవ్వరూ ట్రై చేయలేదు. సో…. తప్పకుండా చూడాల్సిన సినిమా గేమ్ ఓవర్

PB Rating : 3.5/5