గౌత‌మ్ మీన‌న్ కు పెళ్లిచూపులు..

స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ కు ఇప్పుడు పెళ్లిచూపులేంటి అని ఆశ్చ‌ర్యపోవ‌ద్దు. ఇక్క‌డే చిన్న మ‌త‌ల‌బు ఉంది. ఈయ‌న చేసే సినిమాల్లో ఎంత వైవిధ్యం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ల‌వ్ స్టోరీస్ చేయ‌డంలో గౌత‌మ్ ది అందె వేసిన చేయి. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ఓ ఫ్రెష్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ రైట్స్ తీసుకున్నాడు. అదే మ‌న తెలుగులో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన పెళ్లిచూపులు. త‌రుణ్ భాస్క‌ర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కోటితో తీస్తే.. 25 కోట్లు వ‌సూలు చేసింది పెళ్లిచూపులు.

ఇలాంటి సినిమా రీమేక్ రైట్స్ ను ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్ సొంతం చేసుకున్నాడు. త‌మిళ్ లో ఈయ‌న పెళ్లిచూపులు చూపించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాకు ఆయ‌నే ద‌ర్శ‌కుడా.. లేదంటే ఇంకెవ్వ‌ర్నైనా తీసుకుంటాడా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి సస్పెన్స్. కాక‌పోతే పెళ్లిచూపులు త‌మిళ రీమేక్ మాత్రం చాలా గ్రాండ్ గా.. స్టైలిష్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు గౌత‌మ్ మీన‌న్. మ‌రి త‌మిళ‌నాట కూడా కొత్త వాళ్ళ‌తోనే ఈ పెళ్లిచూపులు చేస్తారా లేదంటే పాతోళ్ల‌తోనే పని కానిస్తారా చూడాలి.