జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో, పాటలు విడుదల

ఎస్. ఎన్ ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణ లో ఎస్. ఎన్ చిన్న స్వీయ పర్యవేక్షణ మరియు అల్వాల శేఖర్ మరియు కుండె కుమార్ గార్ల నిర్మాణ సారధ్యం లో జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో వాల్యూం 2 ఆడియో విడుదల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర నాయకుడు  శ్రీ గజాల మధుసూదన్ రెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్ ,  హీరోయిన్ స్మిత రాజ్, మోడల్ రీతూ గిరిధర్, అమిక్ష, రాకేష్ మాస్టర్, గబ్బర్ సింగ్ బ్యాచ్ పాల్గున్నారు. 

 

ఈ రియాలిటీ షో లోని పాటలను ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నాయకుడు  శ్రీ గజాల మధుసూదన్ రెడ్డి మరియు  ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేసారు.

 

అనంతరం తెలంగాణ రాష్ట్ర నాయకుడు  శ్రీ గజాల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ "ఎస్. ఎన్ చిన్న నాకు మంచి మిత్రుడు. ఇలాంటి షో తో కొత్త టాలెంట్ ని అందరికి పరిచయం చేయటం చాల బాగుంది. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. పాటలు విన్నాం చాల బాగున్నాయి. జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో ప్రోగ్రాం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. 

 

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో చాల గొప్ప కార్యక్రమం. ఏవిధమైన రెకమండేషన్ లేకుండా కేవలం టాలెంట్ ని మాత్రమే గుర్తిస్తున్నారు, అందుకు నా అభినందనలు. పాటలు చాల బాగున్నాయి, అందంగా మంచి డాన్స్ కి అనుకూలం గా ఉన్నాయ్. ఈ టీం లో ఉన్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు.  ఎస్. ఎన్ చిన్న కి మంచి విజయం కావాలి " అని తెలిపారు. 

 

ఎస్. ఎన్ చిన్న మాట్లాడుతూ "ఇతర ప్రోగ్రామ్స్ తో పోలిస్తే మా జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో చాల డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రోగ్రాం. ఇందులో మేము సొంతగా మ్యూజిక్ చేసిన పాటలకే డాన్స్ చేస్తాం . ఆల్రెడీ ఫస్ట్ వాల్యూం  రిలీజ్ చేసాం మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వాల్యూం 2 రిలీజ్ చేస్తున్నాం. పాటలు చాల బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజ్ కిరణ్ అందించిన సంగీతం చాల బాగుంది. పాటలు అందరికి నచ్చుతాయి " అని తెలిపారు. 

 

ఈ జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో కి  వ్యాఖ్యాత గా ఉదయభాను, జడ్జ్ లు గా శివశంకర్ మాస్టర్, ప్రీతి జింగనియా , కో ఏంకర్  గా సాక్షి రాజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. రాజ్ కిరణ్, లిరిక్ రైటర్ ఎం. రామ రావు, సినిమాటోగ్రాఫర్ రెబెల్ సుధాకర్ రెడ్డి మరియు మురళి కృష్ణ. ఈ టాలెంట్ షో ద్వారా నూతన డాన్సర్స్ కి, చరియోగ్రాఫేర్ కి మ్యూజిక్ డైరెక్టర్ ని పరిచయం చేస్తాం.