‘జార్జిరెడ్డి’ వస్తున్నాడు..!!

జార్జిరెడ్డి.. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు.. జార్జిరెడ్డి మరణించినా ఆయన ఆశయం బ్రతికే ఉంది. ఆయన కోరుకున్న సమాజం కోసం నేటికీ ఎందరో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రి లుక్ పోస్టర్ విడుదలైంది. జార్జిరెడ్డి అనగానే విపరీతమైన పఠనాసక్తి కలిగిన వాడు అని ఆయన మిత్రులు నేటికీ చెబుతుంటారు. ఆ విషయాన్నే ప్రతిబింబిస్తూ చేతిలో పుస్తకాలతో నాటి కాలపు డ్రెస్సింగ్ స్టైల్ తో కాలేజ్ కు నడిచి వెళుతోన్న “జార్జిరెడ్డి” లుక్ ను విడుదల చేశారు. అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నటీనటుల వివరాలు తెలియజేస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ‘‘మీట్ ద ఫర్ గాటెన్ లీడర్ సూన్’’ అనే టైటిల్ తో పాటు ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే క్యాప్షన్ కూడా ఉంది.మొత్తంగా  ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ టీమ్ ప్రి-లుక్ పోస్టర్ తోనే ఒక్కసారిగా సినిమాపై ఆసక్తి పెంచింది.. 1970 దశకం బాక్ డ్రాప్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి త్రీ లైన్స్ సినిమా బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరాఠీ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన “సైరత్” సినిమాకు సినిమాటోగ్రఫీ అందించి..ఇటీవల “నాన్” అనే సినిమా తో దర్శకుడిగా కూడా మారిన ‘సుధాకర్ రెడ్డి యెక్కంటి’ ఈ చిత్రానికి కెమరామెన్ కావటం విశేషం.ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ  చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాటోగ్రఫీ:సుధాకర్ రెడ్డి యెక్కంటిసంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాతలు : అప్పిరెడ్డి, దామురెడ్డి కొసనం రచన,దర్శకత్వం : జీవన్ రెడ్డి.