ఇసుక మాఫియా నేపథ్యంలో గోదారి నవ్వింది

ఇంద్ర, సత్య హీరో హీరోయిన్లుగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశరావు నిర్మిస్తున్న చిత్రం గోదావరి నవ్వింది. భీమ్ జీ యజ్జల దర్శకునిగా పరిచయమౌతున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సన, జాకీ, కాశీ విశ్వనాథ్ ఇందులో ముఖ్యతారలు.
దర్శకుడు భీమ్ జీ యజ్జల మాట్లాడుతూ… ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే వినూత్నమైన కథాంశమిది. ఇందులో పాత్ర ఐఎయస్ చదువుతున్న కుర్రాడు. హీరోయిన్ సైకత శిల్పి. శ్రీకాకుళం ప్రభుత్వ హైస్కూలు టీచర్ గా పనిచేస్తున్న నేను తరంగ్, ప్రయాణం, ఒక పల్లెలో తదితర లఘు చిత్రాలు తీసి పురస్కారాలు గెలుచుకున్నాను. అని చెప్పారు.

నిర్మాత బలగ ప్రకాశ రావు మాట్లాడుతూ… గోదావరి తీర ప్రాంతాలైన కుమార దేవం, కొవ్వూరు, రాజమండ్రిలో 31 రోజులు తొలి షెడ్యూలు చేశాం. రెండో షెడ్యూలు 10 రోజుల పాటు హైదరాబాద్ లో చేస్తాం. అని అన్నారు.
కెమెరా – సలీం
సంగీతం – మధు
పాటలు – శ్రీనివాస్, సీహెచ్.మోహన్
ఆర్ట్ – రవి
మాటలు – శివ, సీహెచ్ మోహన్.