పుష్క‌ర ఘాట్‌ వద్ద భీభత్సం…పెరుగుతున్న మృతుల సంఖ్య… కంట్రోల్ రూంలో బాబు

ప‌విత్ర గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా భ‌క్తులు పోటెత్త‌డంతో రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగి 17 మంది మృతి చెందారని సమాచారం అందుతోంది. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుండడం అందోళన చెందాల్సిన విషయం.

అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ తొలిరోజు భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డం, ఘాట్ వ‌ద్ద గోడ ఎక్కే ప్ర‌య‌త్నంలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. తొలిరోజే తొక్కిస‌లాట జర‌గ‌డంతో స్థానికంగా ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసు యంత్రాంగం వైఫ‌ల్యం వ‌ల‌నే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని భ‌క్తులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.