యూఎస్‌లో గోపాలా గోపాలా ఆల్ టైం రికార్డు

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గోపాలా గోపాలా సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 10వ తేదీన విడుదలై గోపాలా అమెరికాలో తొలి రెండు రోజులకు రూ 3.85 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ వసూళ్లు త్వరలోనే మిలియన్ మార్క్‌కు చేరుకుంటాయని ఓవర్సీస్ పంపిణీదారులు చెపుతున్నారు. ఇక టాలీవుడ్‌లో ఇప్పటికే పవన్ తన పేరిటే ఉన్న అత్తారింటికి దారేది తొలి రోజు వసూళ్లలో రికార్డుగా ఉంది. ఇప్పుడు గోపాలా కూడా తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడంతో పాటు ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించడం ఈ సినిమా భారీ వసూళ్లకు కారణమైంది.

ఇండియాలో కూడా తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలో గోపాలా టాప్-3లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా ఉండడంతో ఇండియాలో హయ్యస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు సాధించిన సినిమాలలో టాప్-5 పొజిషన్‌లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.