గోపాలా… గోపాలా ఆడియో డేట్.. అనూప్ హైక్వాలిటీ మ్యూజిక్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గోపాలా..గోపాలా సినిమా ఆడియో కొత్త సంవత్సరం కానుకగా జనవరి 2 లేదా 3న విడుదల చేయనున్నట్టు సమాచారం. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ఆడియో విడుదల కాలేదు. షూటింగ్ కూడా కాస్త మిగిలి ఉందని టాక్. అనూప్ మంచి హైక్వాలిటీతో అవుట్ ఫుట్ ఇస్తుండడంతో ఆడియో కాస్త డిలే అయ్యిందని సమాచారం. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హిందీలో హిట్ అయిన ఓ మైగాడ్ సినిమాకు ఇది రీమేక్. ఇందులో వెంకీ భార్యగా శ్రేయ నటిస్తోంది. శరత్‌మరార్-సురేష్‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిషోర్‌కుమార్ పార్థాని(డాలి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తెలుగు తెరపై కనిపించబోతున్నారు.