పవన్-వెంకీ ఫ్యాన్స్‌కు 28న పండగే పండగ.. విశాఖలో గోపాల సాంగ్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ జంటగా తడాఖా దర్శకుడు డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపాలా.. గోపాలా చిత్రం ఫస్ట్‌లుక్(తొలి చూపు)ను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. వెంకీ-పవన్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. డిసెంబర్ మూడో వారంలో ఆడియోను సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత సురేష్‌బాబు ప్రకటించారు. ప్రస్తుతం విశాఖలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో వెంకటేష్-శ్రేయపై ఓ స్పెషల్‌సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు మరో పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుత పోస్ట్ పొడ్రక్షన్ పనులు జరుపుకుంటోంది.