గుణ 369 బిజినెస్ అదుర్స్.. ఫుల్ స్వింగ్ లో ఉన్న ఆర్ఎక్స్ 100 కార్తికేయ

గుణ 369 బిజినెస్ అదుర్స్.. ఫుల్ స్వింగ్ లో ఉన్న ఆర్ఎక్స్ 100 కార్తికేయ

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ‌. ఆ సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించి ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయాడు. ఆ సినిమాతో నిర్మాత‌ల‌కు లాభాల పంట పండించాడు కార్తికేయ‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం 12 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి సంచ‌ల‌నాలు సృష్టించింది. మొన్న‌టికి మొన్న హిప్పీ సినిమాతో వ‌చ్చాడు ఈ హీరో. అయితే ఈ చిత్రం అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కానీ ఇప్పుడు కార్తికేయ న‌టిస్తున్న గుణ 369 సినిమా మాత్రం మ‌ళ్లీ ర‌ప్ఫాడిస్తుంది. హిప్పీ ఫ్లాప్ ప్ర‌భావం ఈ సినిమా బిజినెస్ పై ఏ మాత్రం ప‌డ‌టం లేదని తెలుస్తోంది.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో గుణ 369 బిజినెస్  జ‌రుగుతుండ‌టం విశేషం. ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. దీనికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప‌క్కా మాస్ పాత్ర‌లో కార్తికేయ మ‌రోసారి రెచ్చిపోయి న‌టించాడు. ఈ ఒక్క టీజ‌ర్ తో డిస్ట్రిబ్యూటర్స్ గుణ పై ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా బాగా రావడంతో నిర్మాతలు ధీమాగా వున్నారు. టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో బిజినెస్ కూడా ఫుల్ స్వింగులో జ‌రుగుతుందట.

గుణ సినిమాతో హిట్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు కార్తికేయ‌. త్వ‌ర‌లోనే గుణ 369 విడుద‌ల కానుంది. అరుణ్ జంద్యాల తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో అన‌ఘ హీరోయిన్ గా న‌టిస్తుంది. సాయికుమార్, ఆదిత్య లాంటి సీనియ‌ర్ న‌టులు ఇందులో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి  శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌ సమర్పణ.
స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు.