`గుణ 369` కథ, కథనం రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని రూపొందించాం – నిర్మాతలు శ్రీమతి ప్రవీణ కడియాల, తిరుమల్‌ రెడ్డి,అనిల్‌ కడియాల

టెలివిజన్‌ రంగంలో పరిచయం అక్కర లేని పేర్లు స్ప్రింట్‌ మీడియా, జ్ఞాపిక ఎంటర్‌ ప్రైజస్‌. వీరిద్దరూ సంయుక్తంగా శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ పతాకాలపై అర్జున్‌ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘గుణ 369’. ‘ఆర్‌.ఎక్స్‌.100’ ఫేమ్‌ కార్తికేయ, అనఘ హీరోహీరోయిన్లు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్‌ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్న సందర్భంగా నిర్మాతలు శ్రీమతి ప్రవీణ కడియాల, తిరుమల్‌ రెడ్డి,అనిల్‌ కడియాల మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– టెలివిజన్‌ రంగంలో ఎన్నో సూపర్‌ హిట్‌ ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌ చేసిన అనుభవం మాకుంది. ఒక మంచి సబ్జెక్ట్‌ దొరికితే సినిమా రంగంలోకి రావాలని గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం. అలాంటి టైంలోనే అర్జున్‌ జంధ్యాల ఒక మంచి స్క్రిప్ట్‌తో మమ్మల్ని అప్రోచ్‌ అయ్యారు. యదార్థ సంఘటలన ప్రేరణతో కూడిన ఒక మంచి కథ. మేము నిర్మాతలుగా పరిచయమవడానికి ఇది జెన్యూన్‌ స్క్రిప్ట్‌ అనిపించి ఒకే చేయడం జరిగింది.

ఈ స్టోరీ మీకు ఫర్‌ఫెక్ట్‌ లాంచ్‌ అనుకుంటున్నారా?
– టెలివిజన్‌ రంగంలో స్ప్రింట్‌ మీడియా తిరుమల గారు చేసిన సైమా కానివ్వండి. ఇతర ప్రోగ్రామ్స్‌ కానివ్వండి. అలాగే జ్ఞాపిక ఎంటర్‌ ప్రైజస్‌ చేస్తున్న ప్రోగ్రామ్స్‌ కూడా ఒక రేంజ్‌ లోనే ఉంటాయి. అలాంటిది మేమిద్దరం కలిసి ఒక సినిమాకు వెళ్తున్నామంటే ఆశామాషి సబ్జెక్టుతో అయితే ఇంట్రడ్యూస్‌ అవ్వలేము. ఎలాగైతే టెలివిజన్‌ రంగంలో ఒక స్థాయిలో నిలబడ్డామో. సినిమా రంగంలో కూడా అలానే నిలబడాలి అనే కాన్ఫిడెంట్‌తో రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో కొన్ని స్టోరీస్‌ విని వాటిలో ఇదయితే బాగుంటది అని ఈ స్టోరీని ఫైనల్‌ చేయడం జరిగింది.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– ‘గుణ369’ టైటిల్‌ అనుకోగానే చాలా మంది ఇది ‘ఆదిత్య 369’ సినిమాకు సెక్వెల్‌ అనుకున్నారు. ఇది సోసియో ఫాంటసీ జోనర్‌ సినిమా కాదు. రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని చేసిన సినిమా ఇది. 369 అనేది ఒక ఖైదీ నెంబర్‌. ఆడియన్స్‌ కన్‌ ఫ్యుజ్‌ అవకూడదనే ఆ విషయాన్ని ట్రైలర్‌లో కూడా చూపించాం. స్టోరీ సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే తన కొడుకు పేరు కింద బిటెక్‌ అని పేరు పెట్టుకోవాలనే ఒక తండ్రి కోరిక టోటల్‌గా రివర్స్‌ అయ్యి అతనికి 369 అనే ఖైదీ నెంబర్‌ వస్తే, అలాగే సరదాగా మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలిలో పుట్టి. ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో ఉండే వ్యక్తి ఖైదీగా ఎందుకు మారాడు? అనేది మెయిన్‌ పాయింట్‌. మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడికి మేము చెప్పాలనుకున్న సందేశం క్లియర్‌గా కన్వే అవుతుంది.

ఒక కొత్త దర్శకుడితో ఇంట్రడ్యూస్‌ అవ్వడానికి ప్రత్యేక కారణం ఉందా?
– ప్రతి ఒక్కరూఎదో ఒక టైంలో కొత్తగా మొదలు పెట్టాల్సిందే.. అర్జున్‌ గత పన్నెండు సంవత్సరాలుగా బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్‌ చేశాడు. అతనికి 24 క్రాఫ్ట్స్‌ మీద మంచి గ్రిప్‌ ఉంది. అందుకే మాకు నరెట్‌ చేసిన స్ట్రోరిని అలాగే తీయగలిగాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నా దర్శకత్వ శాఖలో అతనికి 12 సంవత్సరాల అనుభవం ఉండడం మాకెంతో కలిసి వచ్చింది. దర్శకుడు మాకు ఏదయితే చెప్పాడో దాన్నిఅలాగే స్క్రీన్‌ మీద చూపించాడు.

టెలివిజన్‌ వేరు, సినిమా వేరు కదా ప్రొడక్షన్‌ ఏమైనా కష్టం అనిపించిందా?
– అంటే ప్రొడక్షన్‌ ఎక్కడైనా 24 క్రాఫ్ట్స్‌. కాకపొతే కాన్వాస్‌ లెవెల్‌ మారుతుంది. అందుకే మాకు పెద్దగా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.

ఈ కథలో ఉన్న స్పెషలిటీ ఏంటి?
– ఈ సినిమా కథకు ఉన్న స్పెషలిటీ ఏంటంటే.. ఈ సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. డబ్బు ఉంటేనే అన్ని ఆనందాలు ఉంటాయి అనుకునే వారికి .. మనకు బ్రతకడానికి సరిపడాడబ్బు ఉండి, అమ్మప్రేమ,సోదరిప్రేమతో ఆ కుటుంబం ఎలా సంతోషంగా ఉండి అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ. గుణ లాంటి అబ్బాయి నా కొడుకు అయితే ఎంత బాగుంటది అని ప్రతి తండ్రి అనుకునేలా సినిమా ఉంటుంది. అలాగే ఆడపిల్లలను ఎలా గౌరవించాలో తెలిపే మెయిన్‌ పాయింట్‌ మా సినిమాలో ఉంది. అందుకని తప్పకుండా అందరి ఆడియన్స్‌కి మన సినిమా దగ్గరవుతుంది.

బిజినెస్‌ ఎలా ఉంది?
– అన్ని ఏరియాల్లో మా సినిమాకు మంచి డిమాండ్‌ ఉంది. అలాగే నైజాంలో లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌ ‘చేసిన కెఆర్‌ ఎగ్జిబిటర్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్‌ టైం మేము ఇద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుకి ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం హ్యాపీ గా ఉంది.

మీరు ఫస్ట్‌ టైం సినిమా నిర్మాణ రంగం లోకి అడుపెట్టారు కదా! ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్‌ లభించింది?
– ఈ సినిమా మీద మా కన్విక్షన్‌ లెవెల్‌ఎలా ఉన్నాయో.. ఇండస్ట్రీ నుండి కూడా అలాంటి మంచి సపోర్ట్‌ లభించింది. ఒక మంచి కథను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాన్సెప్ట్‌ ప్రకారం మా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు గారు, సెకండ్‌ సాంగ్‌ కమెడియన్స్‌ అలీ బ్రహ్మానందం, మూడవపాటను డైరెక్టర్‌ రాఘవేంద్ర రావు గారు, లేటెస్ట్‌గా నాలుగో పాటను హీరో నాగార్జున గారు విడుదల చేయడం జరిగింది. అలాగే ట్రైలర్‌ అల్లు అరవింద్‌, బోయపాటి శ్రీను కలిసి విడుదల చేసిన విషయం తెలిసిందే.. అందరి నుండి మంచి సపోర్ట్‌ లభించింది

మ్యూజిక్‌ డైరెక్టర్‌ గురించి?
– మ్యూజిక్‌ డైరెక్టర్‌ చైతన్‌ భరద్వాజ్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తరువాత మళ్ళీ ఆ రేంజ్‌లో ఉండే ఆల్బమ్‌ ఇచ్చాడు. నిన్న నాగార్జున గారు కూడా చైతన్‌ భరద్వాజ్‌ని మంచి ఆల్బమ్‌ ఇచ్చావు అని ప్రశంసించడం జరిగింది. మా సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి.

హీరోయిన్‌ అనఘ ఎవరి ఛాయస్‌?
– కథ ప్రకారం హీరోయిన్‌ మన పక్కింటి అమ్మయిలా ఉండాలి మరియు కార్తికేయకు మంచి ఈడుజోడు లా ఉండాలి అందుకని దర్శకుడు, హీరో అందరం కలిసి అనఘనిహీరోయిన్‌ గా సెలెక్ట్‌ చేయడం జరిగింది.

ఇటీవలే సెన్సార్‌ పూర్తయ్యింది కదా?
– మా సినిమా ఇటీవలే సెన్సార్‌ యు /ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. సెన్సార్‌ వారు ఏ విధమైన కట్‌ చెప్పలేదు. అలాగే సెన్సార్‌ వారు కూడా మా టీమ్‌ ని ఈ ఈ మధ్య కాలంలో ఒక్క కరెక్షన్‌ కూడా లేకుండా యు /ఎ ఇస్తున్నాం. అని అప్రిసియేట్‌ చేయడం జరిగింది. మంచి సినిమాలో ఎమోషన్‌ చాలా బాగుంది అన్నారు.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– మంచి కథలు వింటున్నాం. కథ దొరికితే మేము ఇద్దరం కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మణిరత్నం గారి దగ్గర పని చేసిన కిరణ్‌ ఒక స్టోరీ వినిపించడం జరిగింది. ఇంకా కొంచెం డెవలప్‌ చేయమన్నాం. అవ్వగానే మా నెక్స్ట్‌ మూవీ అతనితో ఉంటుంది.