గుణ రఫ్ఫాడిస్తున్నాడుగా…. ఆగస్ట్ 2 వచ్చేస్తున్నాడు…

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ‌. ఆ సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించి ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయిపోయాడు. ఆ సినిమాతో నిర్మాత‌ల‌కు లాభాల పంట పండించాడు కార్తికేయ‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం 12 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి సంచ‌ల‌నాలు సృష్టించింది. మొన్న‌టికి మొన్న హిప్పీ సినిమాతో వ‌చ్చాడు ఈ హీరో. అంచ‌నాలు అందుకోకపోయినా… కమర్షియల్ గా నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు కార్తికేయ న‌టిస్తున్న గుణ 369 సినిమా మాత్రం మ‌ళ్లీ ర‌ప్ఫాడిస్తోంది. బిజినెస్ విషయంలో తన దూకుడు చూపిస్తున్నాడు గుణ.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో గుణ 369 బిజినెస్ జ‌రుగుతుండ‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇటీవలే విడుద‌లైన పాట‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తొలి ప‌రిచ‌య‌మా ఇది.. తొలి ప‌ర‌వ‌శ‌మా ఇది అంటూ సాగే ఈ పాట‌కు సంగీతం పరంగా…. సాహిత్యం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. యూ ట్యూబ్ లో కూడా పాట మంచి వ్యూస్ సాధిస్తోంది. ప‌క్కా మాస్ పాత్ర‌లో కార్తికేయ మ‌రోసారి రెచ్చిపోయి న‌టించాడు. టీజర్ కు, సాంగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఆగస్ట్ 2న గుణ 369 గ్రాండ్ గా విడుద‌ల కానుంది. అరుణ్ జంద్యాల తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో అన‌ఘ హీరోయిన్ గా న‌టిస్తుంది. సాయికుమార్, ఆదిత్య లాంటి సీనియ‌ర్ న‌టులు ఇందులో న‌టిస్తున్నారు. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.