పాలమూరు – రంగారెడ్డి , నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మామ కేసీఆర్ మాదిరిగానే అల్లుడు కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ రెండు ఎత్తిపోతల పథకాలు ఆగవని కుండబద్దలు కొట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకూ కేంద్రం అనుమతులు లేవంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యాలను ఖండించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఎర్రబెల్లి దయకరరావుకు సిగ్గుంటే చంద్రబాబు, దేవినేని ఉమను నిలదీయాలి. ఏ అనుమతులతో పట్టిసీమ, పోలవరాన్ని ప్రారంభించారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డలైతే టీటీడీపీ నేతలు పాలమూరు ప్రాజెక్ట్ పై స్పందించాలి. మంచినీళ్ల కోసం ప్రాజెక్ట్ కట్టొద్దన్న పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే..!"అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.