సినిమా కోసం ఇస్తే కమర్షియల్ కాంప్లెక్సులు కట్టారు – హరీష్ రావ్ ఫైర్

వంశీకృష్ణ, అనుశ్రీ జంటగా నటించిన చిత్రం నువ్వేనా అది నువ్వేనా. ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సిలివేరి రమేష్ బాబు సమర్పణలో ఆర్.కె.ఫిల్మ్ ఫ్యాక్టరీస్ పతాకంపై రాజ్ కుమార్ స్మీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ వెంకట్ సంగీతమందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావ్… సినిమా భూముల్లో కమర్షియల్ కాంప్లెక్సులు కట్టారని విమర్శించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ…. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల్లో కమర్షియల్ కాంప్లెక్సులు వచ్చాయని…. అందుకే రాబోయే రోజుల్లో మరింత పగడ్భందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి హరీష రావ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కెసిఆర్ సమాలోచనలు చేస్తున్నారని త్వరలోనే ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తామని అన్నారు. అలాగే ఎడ్యుకేషన్, సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కించే చిత్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. దీంతో పాటు చిన్న సినిమాల కష్టాలు కూడా తీర్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు. తెలుగు సినిమాలే కాకుండా… బాలీవుడ్ చిత్రల షూటింగులు కూడా చేసుకునే అనువైన పరిస్థితులు ఏర్పడేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.